శత్రువులు కూడా కీర్తించిన స్వాతంత్ర్య సమరయోధుడు.. వీరపాండ్య కట్టబొమ్మన్..
కట్టబొమ్మన్ ను ఎందుకు ఉరి తీశారు?
తరతరాలుగా పోరాట స్ఫూర్తిని నింపిన వీరపాండ్య కట్టబొమ్మన్ జీవిత విశేషాలు ఇవీ..
veerapandiya kattabomman : బ్రిటీషు వారి నుంచి భారత జాతి విముక్తి కోసం జరిగిన తొలి తిరుగుబాటుగా భావించే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందే తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాడినవారిలో వీరపాండ్య కట్టబొమ్మన్ ప్రముఖులు.. తమిళనాడులోని ఒక చిన్న పట్టణమైన పాంజాలకురిచ్చి పాలించిన రాజు వీరపాండ్య కట్టబొమ్మన్.. అంత చిన్న రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు కూడా బ్రిటిష్ ప్రభుత్వం చాలా యుద్ధాలే చే యాల్సి వచ్చింది. 1799 అక్టోబర్ 16న వీరపాండ్య కట్టబొమ్మన్‌ను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేయించి గయత్తర్‌లో ఉరి తీసింది.వీరపాండ్య కట్టబొమ్మన్ 18వ శతాబ్దం చివరిలో బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఆయన 1760లో తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని పంచలంకురిచి గ్రామ...