Thursday, December 26Thank you for visiting

Tag: TG

తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు..500 గ్యాస్ కి ఓకే..

తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు..500 గ్యాస్ కి ఓకే..

Telangana
తెలంగాణ కాబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది.తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు, రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయించింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రచించిన సుప్రసిద్ద గీతం 'జయ జయహే తెలంగాణ' ఎంపిక చేసింది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి( RevanthReddy) అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గం సమావేశమై  పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ లో టీఎస్ ను టీజీ (TG) గా మార్చాలని తీర్మానించింది. ఈనెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తెలంగాణ (Telangana) తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని,  అందుకే కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం తెలిపింది. అలాగే రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.. రాష్ట్ర గీతంగా అందెశ్రీ  జయ జయహే తెలంగాణను ఆమోదించింది. ...