Manabadi TS SSC Results 2024 : పదో తరగతి ఫలితాలు విడుదల.. నిర్మల్ జిల్లా ఫస్ట్.. జూన్ 3 నుం సప్లిమెంటరీ పరీక్షలు
TS SSC Results | తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఎస్సెస్సీ ఫలితాలను రిలీజ్ చేశారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో సున్నా ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. గత సంవత్సరం 89.60 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఈ సారి 91.31 శాతానికి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,05,813 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 4,91,862 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.TS SSC స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు – bse.telangana.gov.in, results.bsetelangana.orgManaba...