Saturday, August 30Thank you for visiting

Tag: Telugu news

Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు

Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు

Trending News
Namo Bharat train : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ రైలు మార్గంలో మరో ముఖ్యమైన దశ పూర్తయ్యింది.న్యూ అశోక్ నగర్ నుండి సారాయ్ కాలే ఖాన్ వరకు విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఓవర్ హెడ్ వైర్లు (OHE) 25 వేల వోల్ట్స్ (25 kV) విద్యుత్తుతో విజయవంతంగా పనిచేసేలా చేయబడ్డాయి. దీని ద్వారా రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సిద్ధమైంది.ఈ మార్గంలో 4 కిలోమీటర్ల OHE సిస్టమ్‌ను విద్యుదీకరించారు.త్వరలో ఈ మార్గంలో ట్రయల్ రన్స్ ప్రారంభం అవుతాయి. విద్యుత్ సరఫరా కోసం సారాయ్ కాలే ఖాన్‌లో ఒక ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్ ఉంది. ఇది 66kV విద్యుత్తును అందుకొని, రైళ్లకు 25kV, స్టేషన్ల అవసరాలకు 33kVగా పంపిస్తుంది.సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ ప్రత్యేకతలు:ఈ స్టేషన్ 4 రైలు మార్గాలు, 6 ప్లాట్‌ఫారమ్‌లు కలిగి ఉంది.5 ప్రవేశ/నిష్క్రమణ గేట్లు, 14 ఎలివేటర్లు, 18 ఎస్కలేటర్లు ఉన్నాయి.స్టేషన్ పొడవు 215 మీటర్లు, వెడల్పు 50 మీటర...
తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision

Andhrapradesh
Cabinet Decision : కేంద్ర మంత్రివర్గ సమావేశం ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి (ఏపీ)- కాట్పాడి (త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి (Tirupati)-కాట్పాడి (Tamil Nadu) లైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.Cabinet Decision :17 భారీ వంతెనలుఈ ప్రాజెక్టులో 17 మేజ‌ర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే ఏడు ఫ్లైఓవర్లు (Over Bridges), 30 అండర్ పాస్ వంతెనలు నిర్...
Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?

Rashi Phalalu | ఈరోజు రాశి ఫలాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి?

astrology
Rashi Phalalu (09-04-2025) : ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు మురళీధరా చార్యులు వివరించారు. 2025 ఏప్రిల్ 9న బుధవారం రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం 🐐 మేషం09-04-2025)Rashi Phalalu : ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. గ్రహబలంలో మార్పు లేదు. ఉద్యోగం విషయమై పై అధికారులతో కలుపుగోలుగా ముందుకు సాగాలి. దైవబలంతో పనులు పూర్తవుతాయి. మీ ధైర్యం సదా మిమ్మల్ని కాపాడుతుంది. అశ్వినీ నక్షత్ర జాతకులు ముఖ్యమైన కార్యక్రమాలు ఉదయం 10 తర్వాత చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. దుర్గాధ్యానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి.🐂 వృషభం09-04-2025)ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషమైన ప్రగతి సాధి...
waqf law | వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

waqf law | వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం

National
waqf amendment act 2025 : దేశంలో నేటి నుంచి వక్ఫ్ సవరణ చట్టం (waqf law) అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేశంలో ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చిందని అందులో పేర్కొంది. వక్ఫ్ సవరణ బిల్లును గత వారం పార్లమెంటు ఉభయ సభలతో ఆమోదం పొందగా ఆతర్వాత రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఆ తర్వాత ఈ కొత్త చట్టం నేటి నుంచి అమల్లోకి వస్తుంది.బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటు ఉభయ సభలు వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించాయి. ఈ బిల్లును ఏప్రిల్ 3న లోక్‌సభ ఆమోదించింది. అక్కడ 288 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏప్రిల్ 4న రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత రాజ్యసభ కూడా దీనిని ఆమోదించింది. ఏప్రిల్ 5న అధ్యక్షుడు ముర్ము కూడా వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆమోదించారు. ఆ తరువాత ఈ కొత్త చట్టం ఏ రోజు నుం...
Waqf bill : అక్రమ వక్ఫ్ ఆస్తులను జప్తు చేస్తాం. యాక్షన్ లోకి దిగిన యోగి ప్రభుత్వం!

Waqf bill : అక్రమ వక్ఫ్ ఆస్తులను జప్తు చేస్తాం. యాక్షన్ లోకి దిగిన యోగి ప్రభుత్వం!

National
Yogi Adhthynath On Waqf bill : వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adhthynath) ప్రభుత్వం యాక్షన్ లోకి దిగినట్లు కనిపిస్తోంది. చట్టవిరుద్ధంగా ప్రకటించిన వక్ఫ్ ఆస్తులను గుర్తించి, కార్యాచరణ ప్రారంభించాలని యోగి ప్రభుత్వం జిల్లా న్యాయాధికారులను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్ రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం కేవలం 2,963 వక్ఫ్ ఆస్తులు మాత్రమే రిజిస్టర్ చేయబడ్డాయి. రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం, సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిన 2533 ఆస్తులు, షియా వక్ఫ్ కు చెందిన 430 ఆస్తులు మాత్రమే నమోదు అయి ఉన్నాయి.Waqf bill : వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదంలోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత, వక్ఫ్ సవరణ బిల్లు శుక్రవారం తెల్లవారుజామున రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. ఎగువ సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. దీనితో బిల్లుకు పార...
Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..

Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో సకల సౌకర్యాలతో పాడ్ హోటల్స్..

Trending News
Delhi Metro Pod hotel | ఢిల్లీ మెట్రో ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అనేక ట్రిప్పులలో బిజీగా ఉంటుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని అనేక ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో ఇప్పుడు స్టేషన్లలో రాత్రిపూట బస చేయడానికి ఏర్పాట్లు చేసింది. DMRC న్యూఢిల్లీ స్టేషన్‌లో ఒక పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేసింది, అక్కడ మీరు నిశ్చింతగా రాత్రిపూట విశ్రాంతి తీసుకోవచ్చు.ఢిల్లీ మెట్రో అనేది ఢిల్లీ వాసులకు జీవనాడి లాంటిది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ లో లక్షలాది మందికి ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్ల రాకపోకలతో నిత్యం కోలాహలంగా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా మెట్రో స్టేషన్‌లోనే పడుకోవచ్చని అనుకున్నారా? మీరు ఖచ్చితంగా నిద్రపోవచ్చు, కానీ రాత్రిపూట మెట్రో సేవలు పూర్తయిన తర్వాత స్టేషన్ లో వెంటనే మీమ్మల్ని బయటకు పంపించేస్తారు. అయినప్పటికీ, మీరు మెట్రో స్టేషన్‌లో నిద్రపోవాలనుకుంటే, ఢిల్లీ మెట్రో మీ కోరికను నెరవేర్చింద...
TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..

TTD | టీటీడీలో హిందువేతరులకు స్థానం లేదు.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వేంకటేశ్వర ఆలయాల నిర్మాణాలు..

Andhrapradesh
TTD News | తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తన నిబద్ధతను చాటుకున్నారు. తన మనవడి నారా దేవాంష్ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి కుటుంబంతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తర్వాత మీడియాతో మాట్లాడిన నాయుడు.. పవిత్ర తిరుమల ఆధ్యాత్మికతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు.TTD లో హిందూయేతర ఉద్యోగుల బదిలీఆలయంలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగులను ఇతర ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రం పవిత్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగులు గ్రహించాలని ఆయన కోరారు. "క్రైస్తవులు కానివారు లేదా ముస్లిమేతరులు వారి వారి ప్రార్థనా స్థలాలలో లేనట్లే, తిరుమలలో కూడా హిందూయేతర ఉద్యోగులు ఉండకూడదు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆస...
TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం

TG Ration Cards | తెల్లరేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఉగాది నుంచి సన్నబియ్యం

Telangana
TG Ration Cards | రాష్ట్రంలోని తెల్ల రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఉగాది నుంచి రేషన్‌ ‌షాపులలో సన్నబియ్యం పంపిణీ  చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాల్గొననున్నారు.కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్‌ ‌షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రేషన్‌ ‌షా...
Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు

Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు

Telangana
TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది.హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది.TG Rain Alertనేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది.IMD HyderabadRain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ...
EPFO EDLI Scheme | PF ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. కొత్త అప్ డేట్ ఇదే..

EPFO EDLI Scheme | PF ఖాతాదారులకు ఉచితంగా రూ.7 లక్షల బీమా.. కొత్త అప్ డేట్ ఇదే..

Business
EPFO EDLI Scheme New Rules 2025 : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) 237వ సమావేశంలో ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకంలో కీలక మార్పులను ప్రకటించింది. సర్వీసులో ఉండగా ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ సవరణలను చేశారు.EPFO EDLI Scheme అంటే ఏమిటి?EDLI పథకం ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో భాగం. ఇది సామాజిక భద్రతను అందిస్తుంది .ఈ పథకం కింద ఒక EPF సభ్యుడు సర్వీసులో ఉన్నప్పుడు మరణిస్తే, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తుంది.EDLI పథకంలో ముఖ్యమైన మార్పులుకనీస బీమా ప్రయోజనంగతంలో ఒక ఉద్యోగి తన మొదటి సంవత్సరం సర్వీసులో మరణిస్తే, ఆ కుటుంబానికి బీమా మొత్తం అందేది కాదు. కానీ కొత్త నిబంధనలలో కనీసం ₹50,000 బీమా ప్రయోజనం లభిస్తుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం 5,000 కంటే ఎక్కువ కుటుంబ...