BSNL 4G: ఇప్పుడు 15,000 మొబైల్ టవర్లలో 4G సర్వీస్
BSNL 4G : ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన 4G సేవను ప్రారంభించింది. ఈ కంపెనీ చరిత్రలో ఇది ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీని అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను అందిస్తోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడేందుకు 5G టెక్నాలజీని పరీక్షించడం కూడా ప్రారంభించింది. అదనంగా, BSNL ఇప్పుడు వినియోగదారులకు 5G సపోర్ట్ చేసే SIM కార్డ్‌లను అందిస్తోంది.BSNL 15 వేలకు పైగా 4G సైట్‌లను ఇప్పుడు ప్రారంభించింది. ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్ క్రింద స్థాపించబడిన ఈ సైట్‌లు భారతదేశం అంతటా ఫాస్టెస్ట్ కనెక్టివిటీని అందిస్తాయని కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా, బిఎస్ఎన్ఎల్ 4G సేవ పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది. ఈ మొబైల్ టవర్లలో భారతదేశంలో తయారు చేయబడిన పరికరాలు అమర్చారు.
బిఎస్ఎన్ఎల్ 4G రోల్ అవుట్ టైమ్‌లైన్...