Thursday, July 31Thank you for visiting

Tag: telangana news

New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

New Energy Policy in Telangana | రాష్ట్రంలో త్వరలో కొత్త విద్యుత్ పాలసీ

Telangana
New Energy Policy in Telangana |  తెలంగాణలో త్వరలో నూతన ఎనర్జీ పాలసీని తీసుకు వొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో మేధావులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti vikramarka)  పలు కీలక విషయాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.35 వేల కోట్లతో చేపట్టిన వైటీపీఎస్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు సందర్శించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కు రామగుండం నుంచి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్ వ్యాగిన్ కు జెండా ఊపి మంత్రులు ప్రారంభించారు. ప్లాంట్ ను సందర్శించిన మంత్రులు పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్ ను మంత్రులు ఈ సందర్భంగా ప్రారంభించారు.ఇప్పటికే రెండో యూనిట్‌ను సెప్టెంబర్ 11న...
Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

Telangana
Indiramma Housing Scheme | సొంతింటి కోసం ఎదురుచూస్తున్న‌ నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. మ‌రికొద్ది రోజుట్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ల‌బ్ధిదారుల‌ ఎంపిక పూర్తి చేయ‌నున్నారు. గ్రామాల్లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే తుది నిర్ణ‌య‌మ‌ని, ఇండ్లు కూడా మ‌హిళ‌ల పేరిటే మంజూరు చేస్తామ‌ని గృహ‌నిర్మాణ‌శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి (Punguleti Srinivas Reddy) తెలిపారు. మ‌రో ముఖ్య విష‌య‌మేమిటంటే ఈసారి ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే చాన్స్ క‌ల్పిస్తున్నారు. రాజ‌కీయ జోక్యం లేకుండా నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యం ఇస్తామ‌ని మంత్రి తెలిపారు. ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టింద‌ని వివ‌రిచారు. ఆధార్‌తో స‌హా అన్నివివరాలు కొత్త‌గా తీసుకొస్తున్న‌ యాప్ లో పొందుప‌రుస్తారు. ఎలాంటి డిజైన్లు లేవు.. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ...
భక్తులకు శుభవార్త..  కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ లు

భక్తులకు శుభవార్త.. కార్తీకమాసం శైవక్షేత్రాలకు ఆర్టీసీ స్పెషల్‌ సర్వీస్ లు

Telangana
RTC Karthika Masam Special Buses : పవిత్ర కార్తీక‌ మాసంలో రాష్ట్రంలోని ప్ర‌సిద్ధ‌ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD Sajjanar ) వివ‌రాల‌ను వెల్లడించారు. వేముల‌వాడ, శ్రీశైలం, ధ‌ర్మపురి, కీస‌ర‌గుట్ట, త‌దిత‌ర దేవాల‌యాల‌కు హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక‌ బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని స‌జ్జ‌నార్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ప‌నితీరు, కార్తీక‌మాసం ఛాలెంజ్, శ‌బ‌రిమ‌ల ఆపరేష‌న్స్‌, మహాల‌క్ష్మి-మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం త‌దిత‌ర అంశాల‌పై హైద‌రాబాద్ బ‌స్ భ‌వ‌న్ నుంచి ఉన్నతాధికారులతో ఈరోజు ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ నిర్వహించారు. కార్తీకమాసంలో స్పెషల్‌ బస్‌లు : టీజీఎస్‌ ఆర్టీసీకి కార్తీక‌ మాసం, శ‌బ‌రిమ‌ల యాత్ర‌ ఎంతో కీల‌క‌మ‌ని, భ‌క్తుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా త‌గిన చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న‌ అ...
హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్..

హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్..

Telangana
Hyderabad Metro Rail Second Phase Update | హైదరాబాద్‌లో కొత్త మెట్రో మార్గాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు పరిపాలన పరమైన అనుమలు ఇస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.  ఐదు రూట్ల మేర 76.4 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలో మీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణం పార్ట్ B ఆరో రూట్ గా ఉంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో విస్తరణలో మొత్తం 116.4 కిలో మీటర్ల పొడవు కొత్తగా మెట్రో ట్రైన్లు ప్రజలకు సేవలందించనున్నాయి. ఇందుకోసం రూ.24.269 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది. ఐదు కారిడార్లునాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ : 36.8 కిలో మీటర్లు రాయ్ దుర్గం నుంచి కోకాపేట్ : 11.6 కి.మీ MGBS నుంచి ఓల్డ్ సిటీ : 7.5 కి.మీ మియా పూర్ నుంచి పటాన్ చెర్వు ;...
Telangana Cabinet | ములుగు గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు.. మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం

Telangana Cabinet | ములుగు గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు.. మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం

Telangana
Telangana Cabinet Decisions : సచివాలయంలో  సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ప్రధానంగా మూసీ ప్రక్షాళన చర్యలు, హైడ్రా, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, బోనస్ చెల్లింపు,  కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై  మంత్రివర్గం చర్చించింది. దీంతోపాటు పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ఏటూరునాగాారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఈ క్రమంలోనే సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.మద్నూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా  అప్‌గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంచాలని తీర్మానించారు. అలాగే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్...
Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..

Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్..

Telangana
Indiramma Housing Scheme Update : రాష్ట్ర ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై కసరత్తు మొద‌లుపెట్టింది. ఇందుకోసం లబ్దిదారుల ఎంపిక ప్ర‌క్రియ‌ పార‌ద‌ర్శకంగా జ‌రిగేలా చ‌ర్య‌లు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఈ యాప్ లో కొన్ని మార్పులుచేర్పులు చేసిన త‌ర్వాత త్వరలోనే యాప్ ను విడుద‌ల చేయ‌నున్నారు. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy ) వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ ను రూపొందించిన‌ట్లు మంత్రి చెప్పారు. ఇండ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక అత్యంత‌ పార‌ద‌ర్శకంగా ఉంటుంద‌ని, రాజ‌కీయ పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిర‌మ్మ ఇళ్లు అందిస్తామ‌న్నారు. ల‌బ్దిదారుల ఎంపిక నిమిత్తం రూపొందించిన యాప్‌ను శ‌నివారం ఆయన స‌చివాలయంలోని త‌న కార్యాల‌యంలో ప‌రిశీలించారు. అయితే ఈ యాప్‌లో ఒక‌టి రెండు మార...
Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..

Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..

Telangana
Hyderabad | రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం (Real Estate)  నష్టాల్లో కూరుకుపోతోంది. ఆస్తుల‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావ‌డంలేదు. బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేప‌ట్ట‌డంలేదు. తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI ) తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాల్సిన అనేక సమస్యలను నివేదించింది. ఆగస్టులో కొన్ని సూచనలు చేసింది, అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదని క్రెడాయ్ పేర్కొంది. జిల్లాల్లో లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు చేయడంలో విపరీతమైన జాప్యంపై రియల్ ఎస్టేట్ వ‌ర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరైన కార్యక్రమంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. జిల్లాల్లో అనుమతుల మంజూరులో జా...
Job Notification | నిరుద్యోగ యువ‌త‌కు తీపి క‌బురు .. వైద్య‌శాఖ‌లో ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

Job Notification | నిరుద్యోగ యువ‌త‌కు తీపి క‌బురు .. వైద్య‌శాఖ‌లో ఉద్యోగాల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

Career
Job Notification In Medical Department: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో 371 పోస్టుల భర్తీకి మెడికల్ రిక్రూట్ మెంట్ బోర్డు (Medical Recruitment Board) నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్ట్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాగా, గత నెలలో విడుదల చేసిన ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మెడిక‌ల్‌ బోర్డు ప్ర‌క‌టించింది. గత నెలలో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అదనంగా మరో 272 పోస్టులను చేర్చింది. ఈ క్రమంలో మొత్తంగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 2,322కు చేరాయి. ఈ నెల 14లోగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని.. నవంబర్ 17వ తేదీన ఆన్ లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్ల‌డించింది.కాగా గత నెలలో 633 ఫార్మాసిస్ట్ పోస్టులకు అదనంగా మరో 99 పోస్టులను కలుపుతూ తాజాగా మరో...
Job Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్

Job Notification | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో మరో భారీ నోటిఫికేషన్

Career
Bhatti Vikramarka On Job Notification |  నిరుద్యోగులకు ప్రభుత్వం (Congress Governament) గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విద్యుత్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka Mallu )  వెల్లడించారు. ఈరోజు ఖమ్మం కలెక్టరేట్‎లో విద్యుత్ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాకలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ భర్తీ చేస్తామని తెలిపారు. విద్యుత్ శాఖలో పదోన్నతులు లేక అధికారులు ఇబ్బందులు పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్స్ ఇచ్చామని తెలిపారు..క్షేత్రస్థాయిలో లైన్ మెన్ల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముందని అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువుల విషయంలో కొత్త పథకం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదన్నారు. కరెంట్ ట్రిప్ క...
Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

Andhrapradesh
Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ (MHA)  అధికార ప్రకటనలో పేర్కొంది.  రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF) కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఇక మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమబెం...