Monday, December 23Thank you for visiting
Shadow

Tag: Telangana Government

Family Digital Card | ఇక‌పై ప్ర‌తీ కుటుంబానికి ఫామిలీ డిజిట‌ల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..

Family Digital Card | ఇక‌పై ప్ర‌తీ కుటుంబానికి ఫామిలీ డిజిట‌ల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..

Telangana, తాజా వార్తలు
Family Digital Card | రాష్ట్రంలోని ప్ర‌తీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ‌యించింది. ఇందు కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. పైలట్ ప్రాజెక్టు అమ‌లు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తోపాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు జారీ చేయ‌నున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం మాదిరిగానే `వన్ స్టేట్ – వ‌న్ డిజిటల్ కార్డ్` విధానాన్ని తెలంగాణ‌లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ల‌బ్ధిదారులు ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందుతాయి. అందులో ప్రతీఒక్కరి హెల్త్ పొఫైల్ త‌ప్ప‌ని...
Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ..  త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌

Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ.. త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌

Career
Talangana Govt Jobs | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) రాష్ట్రవ్యాప్తంగా 2,050 నర్సింగ్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు దరఖాస్తులకు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నవంబర్ 17 న నిర్వ‌హించేలా షెడ్యూల్ చేశారు.పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్, MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ క్యాన్సర్ సెంటర్‌తో సహా అనేక విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. కాగా, తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాలకు వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990గా ఉంది.అభ్య‌ర్థులు రాత పరీక్షకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభ...
LRS Applications | మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్..  ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

LRS Applications | మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్.. ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

Telangana
LRS Applications | రాష్ట్రంలో ఎల్ ఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తుల గురించి వేచిచూస్తున్న ప్ర‌జ‌లకు ఊర‌ట‌నిచ్చేలా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2020లో ప్రకటించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తులను క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ప‌రిష్క‌రించేందుకు, అలాగే అక్రమ క్రమబద్ధీకరణకు ఆగస్ట్‌ మొదటి వారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. మూడు దశల్లో ప్రక్రియ.. ప్లాట్ల దరఖాస్తుల పరిశీలనను మూడు దశల్లో చేప‌ట్ట‌నున్నారు. అలాగే లేఅవుట్ల దరఖాస్తుల పరిశీలనను నాలుగు దశల్లో పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ సమస్యల కారణంగా 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు 25 లక్షల దరఖాస్తులను క్రమబద్ధీకరించడానికి నిర్ణీత రుసు...
Mahila Shakti canteens : త్వరలో మహిళా శక్తి కాంటీన్లు..

Mahila Shakti canteens : త్వరలో మహిళా శక్తి కాంటీన్లు..

Telangana
Mahila Shakti canteens| హైదరాబాద్: వచ్చే రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా కనీసం 150 'మహిళా శక్తి' క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ అవుట్‌లెట్‌లు తక్కువ ధరతో  ఆహారాన్ని అందిస్తాయి. కర్నాటకలో 'ఇందిరా క్యాంటీన్‌ల' (Indira canteens) తరహాలో ఇవి ఉంటాయి. మహిళా స్వయం సహాయక సంఘాలకు (స్వయం సహాయక బృందాలు) క్యాంటీన్లు కేటాయించనున్నారు. మహిళా సంఘాల సహకారంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చి 12న పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమక్షంలో మహిళా శక్తి పాలసీ పత్రాన్ని విడుదల చేశారు. బ్యాంకుల ద్వారా లక్ష కోట్ల రుణాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్త్రీ నిధి’ కార్యక్రమాల ద్వారా వచ్చే ఐదేళ్లలో కాంగ్ర...
Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ ‌సిలిండ‌ర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?

Subsidy Gas Cylinder : సబ్సిడీ గ్యాస్ ‌సిలిండ‌ర్లు ఏడాదికి ఎన్ని ఇస్తారో తెలుసా.. ?

Telangana
Mahalaxmi Scheme Subsidy Gas Cylinder : తెలంగాణ ప్ర‌భుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇటీవ‌లే రూ.500ల‌కు గ్యాస్ సిలిండ‌ర్ ప‌థ‌కాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఈ ప‌థ‌కానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇప్ప‌టికే అర్హుల జాబితాను కూడా రూపొందించింది. ఏడాదికి ఎవరికి ఎన్ని సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై ప్రణాళిక‌లు సిద్ధం చేసింది. రూ.500 గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌పథకానికి అర్హులైన వారి మూడు సంవ‌త్స‌రాల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఏడాదికి ఇవ్వాల్సిన గరిష్ట సిలిండర్ల సంఖ్య ఎనిమిదిగా నిర్ధారించింది. అయితే ఈ పథకానికి మొద‌ట‌ 39.78 లక్షల మందిని అర్హులుగా తేల్చగా.. తర్వాత ఆ సంఖ్య 39.50 లక్షలకు తగ్గింది. ఇది మరింత తగ్గవచ్చని సమాచారం. అర్హులైన వారిలో దాదాపు 9.10 లక్షల మంది అత్యధికంగా ఏటా 8 గ్యాస్‌ ‌సిలిండర్లు చొప్పున వినియోగిస్తారని అధికారులు గుర్తించారు. దీంతో ఈ పథకం కింద సబ్సిడీపై ఇవ్వబోయే...
Mahalakshmi Scheme: రూ. 500 గ్యాస్ కు ఇవి ఉండాల్సిందే.. విధివిధానాలు ఇవే.. 

Mahalakshmi Scheme: రూ. 500 గ్యాస్ కు ఇవి ఉండాల్సిందే.. విధివిధానాలు ఇవే.. 

Telangana
Rs 500 Gas Cylinder Scheme: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం ప్రారంభించారు. అలాగే రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు.హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా తెలంగాణ సర్కారు ((Telangana Government) మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా విడుదల చేశారు. ఈ నిబంధనల ప్రకారం.. పథకాన్ని ఎలా అమలు చేస్తారు? ఈ పథకానికి ఎవరు అర్హులు? వంటి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 లకు గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి సంబంధించిన జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.  సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోస...