పచ్చబొట్లే కామాంధులను పట్టించాయి.. బాలికపై సామూహిక అత్యాచార నిందితులు నలుగురికి జీవిత ఖైదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలో అక్టోబర్ 2021లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆ నేరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వ్యాప్తి చేసిన నలుగురు వ్యక్తులకు బుధవారం జిల్లా కోర్టు వారి జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కేసులో నిందితుల చేతులపై ఉన్న టాటూ(Tattoos)లు కీలకంగామారి వారిని పట్టించాయి.ముర్షిదాబాద్‌లోని లాల్‌బాగ్ సబ్-డివిజనల్ కోర్టులో దోషులు బాసుదేబ్ మొండల్, మిథున్ దాస్, ఆకాష్ మొండల్ తోపాటు అరుణ్ మోండల్‌లకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి దీప్తా ఘోష్ తీర్పు వెలువరించారు. .
లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పురుషులు దోషులుగా తేల్చారు. కాగా ఈ కేసు విచారణ 120 రోజుల్లో ముగిసింది." గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కోర్...