IRCTC Divya Dakshin Yatra | తెలుగు రాష్ట్రాల నుంచి భారత్ గౌరవ్ రైలు.. 9 రోజుల్లో 7 పుణ్యక్షేత్రాలు సందర్శించండి..
IRCTC Divya Dakshin Yatra : దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు అలాగే ప్రముఖ దేవాలయాలను దర్శించుకోవాలనే భక్తుల కోసం ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా 'దివ్య దక్షిణ యాత్ర' టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. తిరువణ్ణామలై ( అరుణాచలం) - రామేశ్వరం - తిరువనంతపురం - కన్యాకుమారి-తంజావూరును కవర్ చేస్తూ, 2AC, 3AC, SL కోచ్ లతో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు టూర్ ప్యాకేజీ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంది. తొమ్మిది రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.14, 250 గా నిర్ణయించింది. .దివ్య దక్షిణ యాత్రలో కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తిరువణ్ణామలై, తంజావూరు, తిరుచ్చి, తిరువనంతపురం (త్రివేండ్రం) వంటి ఆధ్యాత్మిక కేంద్రాలను కవర్ చేస్తారు. తదుపరి పర్యటన ఆగస్టు 04న సికింద్రాబాద్ నుంచి ప్రారంభమవుతుంది.సీట్ల సంఖ్య : 716 (SL: 460, 3A...