Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Talangana

Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు షాక్‌.. వాహ‌నాల పార్కింగ్ డ‌బ్బులు చెల్లించాల్సిందే..
Telangana

Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు షాక్‌.. వాహ‌నాల పార్కింగ్ డ‌బ్బులు చెల్లించాల్సిందే..

Metro Rail Parking Fee | హైద‌రాబాద్‌ మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లు నాగోల్, మియాపూర్‌లో ఉచిత వాహన పార్కింగ్‌కు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ముగింపు ప‌ల‌కబోతున్న‌ది. నాగోల్‌ స్టేషన్‌లో ఇప్ప‌టికే పార్కింగ్‌ ఫీజుల‌ను వ‌సూలు చేయ‌డం ప్రారంభించింది. గ‌త బుధ‌వారం వాహనాన్ని నిలిపేందుకు వెళ్లిన ప్ర‌యాణికుల‌కు రాత్రి స‌మ‌యంలో అక్క‌డ కొత్త‌ బోర్డులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. పార్కింగ్‌ ఫీజులు చెల్లించాలనే బోర్డులో పేర్కొన‌డంతో స్టేషన్‌లో నిరసన చేప‌ట్టారు. పార్కింగ్‌ వ్యవస్థల పని తీరును పరీక్షించేందుకు ట్రయల్స్‌ చేపట్టామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆ త‌ర్వాత‌ మెట్రో రైలు సంస్థ ఒక‌ ప్రకటనలో పేర్కొంది. బైకు రూ.40, కారుకు రూ.120 నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి, మియాపూర్‌ స్టేషన్‌లో సెప్టెంబరు 1 నుంచి పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ స్ప‌ష్టం చేసింది....
DSC Recruitment 2024 | సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ
Career

DSC Recruitment 2024 | సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ

DSC Recruitment 2024 | తెలంగాణ‌లో సెప్టెంబర్‌ ఆఖరి వారం నుంచి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించాల‌ని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం కసరత్తు కూడా మొద‌టుపెట్టింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరు వ‌ర‌కు తుది కీ విడుదల చేయ‌నునుంది. మరోవైపు జిల్లాల వారీగా వివిధ కేటగిరీ పోస్టుల విభజన, డీఎస్సీ పరీక్ష రాసిన అభ్య‌ర్థుల వివ‌రాలు, రోస్టర్‌ విధానంపై విశ్లేషిస్తున్నారు. పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన కార‌ణంగా ఫలితాలను వేగంగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 మంది పరీక్ష రాశారు. త్వ‌ర‌లో ఫైనల్‌ కీ విడుదల చేయ‌నున్నారు. మ‌రుస‌టి రోజు ఫలితాలను వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.రోస్టర్‌ విధానం, జిల్లాల వారీగా పో...
Free Bus Service | మహిళా ప్రయాణికులకు బ్యాడ్​ న్యూస్​.. ఇక వారు టికెట్ కొనాల్సిందేనా.. ?
Telangana

Free Bus Service | మహిళా ప్రయాణికులకు బ్యాడ్​ న్యూస్​.. ఇక వారు టికెట్ కొనాల్సిందేనా.. ?

Telangana Free Bus Service : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే డిమాండ్ కు తగినట్లుగా  ఎక్స్‌ప్రెస్‌ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) పెంచడం లేదు. దీంతో బస్ స్టాండ్లు, బస్ స్టాపుల్లో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఒకవేళ బస్సులు వచ్చినా అవి పూర్తిగా జనంతో నిండిపోయి కనీసం నిలబడి ప్రయాణించే వీలు కూడా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలు గత్యంతరం లేక   డబ్బులు చెల్లించి డీలక్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు.  ఈ విషయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మహిళలను డీలక్స్‌ బస్సులవైపు వారిని మళ్లించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మహిళలను డీలక్స్ బస్సులవైపు ఆకర్షించేందుకు  తాజాగా డీలక్స్‌ బస్సు (Deluxe Bus ) ఎక్కితే వారికి  బహుమతులు ఇస్తామంటూ కొ...
ORR Hyderabad |  ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో  ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..
Telangana

ORR Hyderabad | ట్రాఫిక్ చిక్కులకు బైబై.. త్వరలో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆర్ఆర్ఆర్ కు మధ్య రేడియల్ రోడ్లు..

ORR Hyderabad | హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ను రీజినల్ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేడియల్‌ రోడ్లను నిర్మించనుంది. పెండింగ్‌లో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, ఉప్పల్‌, అంబర్‌పేట్‌ ఫ్లై ఓవర్ల పనుల వేగవంతమైన పనులపై ఇటీవల రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది.అనంతరం ఆయన మాట్లాడుతూ ఓఆర్‌ఆర్‌ను (ORR Hyderabad)  ఆర్‌ఆర్‌ఆర్‌తో అనుసంధానం చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం, రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డితో చర్చించామన్నారు. ట్రాఫిక్ కష్టాలను తగ్గించి ట్రాఫిక్‌ కష్టాలనువ్వు తొలగించేందుకు  రాష్ట్రంలో మరిన్ని రోడ్లను నిర్మిస్తామని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ హైవేగా NH-65కి సంబంధించి, మేము బ్లాక్ స్పాట్‌లకు సంబంధించిన పనులను ప్రారంభించాము, రోడ్లు అధ్వ...