Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?
Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు.అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొదట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివర్గంలో మిత్రపక్షాలకు కూడా పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగుద...