Saturday, August 30Thank you for visiting

Tag: Sunil Sharma

Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?

Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?

Elections
Jammu And Kashmir News | జమ్మూ కాశ్మీర్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రి సునీల్ శర్మ (Sunil Sharma ) ఆదివారం ఎన్నికయ్యారు జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుని పాత్రను స్వీకరించడానికి ఆయ‌న‌ సిద్ధమ‌య్యారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 29 సీట్లు సాధించింది. 2015లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. అది జూన్ 2018 వరకు కొనసాగింది.సునీల్ శర్మ ఎన్నికతో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించిన బిజెపి, జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. 47 ఏళ్ల శర్మ.. కేంద్ర పాలిత ప్రాంతంలో 2022 డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత కొత్తగా సృష్టించబడిన నియోజకవర్గమైన పెద్దర్ నాగసేని నుంచి స్వల్ప తేడాతో గెలుపొంది, అసెంబ్లీకి రెండవసారి ఎన్నికయ్యార...