
Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..
QR code ticketing system : రైల్వే స్టేషన్లు తరచుగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతూ ఉంటాయి. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరి ఉంటారు. క్యూలైన్ లో టికెట్ కోసం నిలుచుండగానే ఒకోసారి ట్రైయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) కూడా తాజాగా అప్ డేట్ అయింది.సాధారణ రైల్వే టికెట్లను క్యూఆర్ కోడ్ (QR code ticketing system) ద్వారా బుక్ చేసుకొనే అదిరిపోయే ఫీచర్ ను దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. తొలిదశలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని 14 రైల్వే స్టేషన్లలో ఉన్న 31 కౌంటర్లలో ఈ సౌకర్యాన్ని ప్రారంభించారు. జనరల్ బుకింగ్ కౌంటర్లలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ క్యూాఆర్ కోడ్ టికెట్లను ప్రవేశపెట్టినట్లు రైల్...