Friday, January 23Thank you for visiting

Tag: smrithi irani

Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

Elections 2024 : అమేథీ నుంచి కాంగ్రెస్‌ ఎవరు పోటీ చేస్తారు? రాహుల్ గాంధీ స్పంద‌న ఇదే..

National
Amethi | న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. హస్తం పార్టీకి కంచుకోట‌లా ఉన్న ఈ స్థానంలో పార్టీ ఎవ‌రిని నిలుపుతుంద‌నే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఈరోజు విలేకరుల సమావేశంలో సస్పెన్స్‌ను కొనసాగించారు. అమేథీలో ఎవ‌రు ఉంటారు అని విలేఖ‌రులు అడుగ‌గా, "ఇది బిజెపి ప్రశ్న, చాలా బాగుంది. నాకు పార్టీ ఏ ఆదేశాలు జారీ చేసినా దానిని నేను అనుసరిస్తాను. మా పార్టీలో, ఈ (అభ్యర్థుల ఎంపిక) నిర్ణయాలన్నీ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తీసుకుంటుంది" అని రాహుల్‌ గాంధీ అన్నారు. తాను పార్టీకి సైనికుడినని, కమిటీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న అమేథీ 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఇప్పటికే వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ.. అమేథీ నుంచి కూ...