400కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం..
Aligarh: రామమందిరం కోసం ప్రపంచంలోనే అతిపెద్దదైన తాళాన్ని తయారు చేశాడు అలీఘర్ కు చెందిన ఒక రామభక్తుడు సత్య ప్రకాశ్ శర్మ. చేతితో తాళాలను తయారు చేయడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. తాజాగా అయోధ్యలోని రామమందిరం కోసం ఏకంగా 400 కిలోల తాళాన్ని రూపొందించారు. రామమందిరం వచ్చే ఏడాది జనవరిలో భక్తుల కోసం ప్రారంభించనుండగా సత్య ప్రకాష్ శర్మ "ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో తయారు చేసిన తాళం" సిద్ధం చేయడానికి నెలల తరబడి కష్టపడ్డారు. దానిని ఈ సంవత్సరం చివర్లో రామ మందిర అధికారులకు బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నారు.శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు మాట్లాడుతూ తమకు చాలా మంది భక్తుల నుండి కానుకలు అందుతున్నాయని, తాళం ఎక్కడ ఉపయోగించాలో చూడాలని అని పేర్కొన్నారు.
45 ఏళ్లుగా 'తాళా నగరి' (taala nagri) లేదా తాళాల భూమి (land of locks) అని కూడా పిలువబడే అలీఘర్‌లో తాళాలు తయారు చేయడంలో తన కుటుంబం ఒక శతాబ్దానికి పై...