Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత డిమాండ్
Sandeshkhali row : పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali) లో అధికార టీఎంసీ పార్టీని 'ఉగ్రవాద సంస్థ'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) నివాసంలో విదేశీ రివాల్వర్‌లతో సహా అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న తరువాత సువేందు అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రమాదకర ఆయుధాలు, పేలుడు పదార్థాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, షేక్ లాంటి ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగే నైతిక అధికారాన్ని కోల్పోయారని అన్నారు.''సందేశ్‌ఖాలీలో దొరికిన ఆయుధాలన్నీ విదేశాల నుంచి వచ్చినవే.. ఆర్డీఎక్స్ ల...