Old city metro line | పాతబస్తి మెట్రో పనులు మొదలయ్యేది అప్పుడే..
Old city metro line | హైదరాబాద్ పాతబస్తీ వాసుల చిరకాల వాంఛ అయిన మెట్రో రైలు పనుల ప్రారంభానికి మరికొద్ది రోజులు వేచి చూాడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మెట్రో లైన్ కోసం భూసేకరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. పాతబస్తీలో మెరుగైన ఫుట్‌పాత్‌లు, పబ్లిక్ స్థలాలు, వాహనాల కోసం తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రూట్ రూ.2,000 కోట్లతో MGBS నుంచి ఫలక్‌నుమా వరకు 5.5-కిలోమీటర్ల మేర లైన్ ను నిర్మించనున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేశారు. అయితే ఈ పనులు లోక్‌సభ ఎన్నికల తర్వాత మాత్రమే ముందుకు సాగే అవకాశం ఉంది.
నాలుగు ఓవర్ హెడ్ స్టేషన్లు..
ప్రతిపాదిత రోడ్డును 100 అడుగులు లేదా 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. రోడ్డు విస్తరణలో సుమారు 1,100 ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని హైదరాబాద్ మెట్రో...