జూన్ 20న జగన్నాథ రథయాత్ర
ఏర్పాట్లు చేసిన జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్
Secunderabad's Shree Jagannath Rath Yatra : హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని జగన్నాథ రథయాత్ర జూన్ 20న నిర్వహించనున్నట్లు జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ శుక్రవారం ప్రకటించింది. జగన్నాథ స్వామి రాంగోపాల్ ట్రస్ట్ ప్రతి సంవత్సరం జగన్నాథ పురి వద్ద జరిగే రథయాత్రతో పాటుగా జగన్నాథుడు, బలభద్రుడు- సుభద్ర దేవి కోసం రథయాత్రను నిర్వహిస్తోంది . ట్రస్ట్ గత 130 సంవత్సరాలుగా సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుండి క్రమం తప్పకుండా రథయాత్రను నిర్వహిస్తోంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా అమ్మవారి రథయాత్రలో భాగంగా, సికింద్రాబాద్ జనరల్ బజార్‌లోని జగన్నాథ ఆలయ ద్వారాలు ఉదయం 6.15 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు దర్శనం కోసం తెరచి ఉంచుతారు.
అనంతరం Jagannath Rath Yatra సాయంత్రం 4 గంటలకు ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభమై జనరల్ బజార్, ఎంజీ రోడ్డు మీదుగా సాయంత్రం...