Bengal Train Accident | పట్టాలు తప్పిన సికింద్రాబాద్ – షాలిమార్ ఎక్స్ ప్రెస్
Bengal Train Accident | పశ్చిమ బెంగాల్‌లోని హౌరా సమీపంలో శనివారం తెల్లవారుజామున 5:30 గంటలకు సికింద్రాబాద్-షాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (West Bengal train derailment) కు చెందిన టి హ్రీ కోచ్‌లు పట్టాలు తప్పాయి. కోల్‌కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నల్పూర్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని సౌత్ ఈస్టర్న్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన కోచ్‌లలో పార్శిల్ వ్యాన్, B1 ప్యాసింజర్ కోచ్ ఉన్నాయి.నల్పూర్ స్టేషన్‌లో రైలు మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు మారుతుండగా పట్టాలు తప్పినట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) ఓంప్రకాష్ చరణ్ తెలిపారు. "ఈ ఉదయం, 5.30 గంటలకు, 22850 సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్ నల్పూర్ రైల్వే స్టేషన్‌లో మిడిల్ లైన్ నుంచి డౌన్ లైన్‌కు వెళుతుండగా పట్టాలు తప్పింది. ఇందులో ఒక పార్శిల్ వ్యాన్, రెండ...