Dasara Holidays 2024 | విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులు ఎప్పటి నుంచో తెలుసా.. ?
Dasara Holidays 2024 | విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఈ సెప్టెంబరులో విద్యార్థులు చాలా రోజులు సెలవులు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో దసరా పండగ వస్తోంది. దీంతో దసరా పండగ సెలవుల కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెలవులు వచ్చాయంటే చాలు హ్యాపీగా ఊళ్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ విజయదశమి పండగకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 15వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతితో సెలవులు మొదలవుతాయి.ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించాయి. మళ్లీ అక్టోబర్ 15వ తేదీ నుంచి స్కూళ్లు ప్రా...