Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు.ఉదయం సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారుల సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దే శవ్యాప్తంగా సంచలనంగా రేపింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల నిఘాలో తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీ సర్కారు 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు. కానీ ఆ తర్వాత రద్దు చేశారు.Delhi Liquor Policy Case లో ఏ...