Rythu Runa-Mafi Guidelines | రైతులకు శుభవార్త.. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రేషన్ కార్డు ఆధారంగా..
Rythu Runa-Mafi Guidelines | హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ (Loan Waiver) చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తింపు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తించనున్నారు.
రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది..
12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09 డిసెంబర్ 2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలను మాఫీ చేయనున్నారు.
2023 డిసెంబర్ 09 నాటికి బకాయి వున్న అసలు, వడ్డీ మొత్తం పథకానికి అర...