TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో తెలంగాణ రోడ్లపైకి 1,500 కొత్త బస్సులు
TGSRTC | కిక్కిరిసిపోయిన బస్సుల్లో ప్రయాణిస్తున్న వారి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ రోడ్లపైకి మరో 1500 బస్సులు రానున్నాయి. ఈ విషయాన్ని స్యయంగా రవాణా, బిసి సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు ఇప్పటికే వెయ్యి బస్సులు కొనుగోలు చేశామని, త్వరలో మరో 1500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఈమేరకు శనివారం నల్లగొండ బస్ స్టాండ్ లో కొత్త బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో నల్లగొండ నుంచి హైదారాబాద్ కు 3 డీలక్స్, ఒక ఏసీ బస్సు ,ఒక పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి.ఈ సందర్భంగా బస్ స్టాండ్ నుంచి జ్యోతిరావు పూలే భవన్ వరకు మంత్రులు బస్సులో ప్రయాణించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు (TGSRTC Employees ) 21 శాతం పిఆర్సి అందించామని, 3035 ఉద్యోగాల భర్తీ చేస్తున్నామని నియామక ప...