RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేకరణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (RRR ) ప్రాజెక్టుకు కావలసిన భూసేకరణ కు మొదటి ప్రాధాన్యం ఇచ్చి సెప్టెంబర్ రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ... హైదరాబాద్ లోప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టుపై ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. భూసేరణ నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.RRR కింద భూములు...