ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
గత ఏడాది ఏడున్నరేళ్ల బాలికపై అత్యాచారం చేసి అతికిరాతకంగా హత్య చేసిన కేసులో దోషిగా తేలిన 22 ఏళ్ల కామాంధుడికి హర్యానా(Haryana)లోని కైతాల్(Kaithal)లోని కోర్టు శనివారం మరణశిక్ష విధించింది. దోషి, పవన్ కుమార్ అలియాస్ మోని, ఊరగాయల వ్యాపారి.కాగా పవన్ కుమార్ కు మరణశిక్ష విధిస్తూ కోర్టు దీనిని అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా పేర్కొంది. "ఇలాంటి అసహ్యకరమైన, హేయమైన చర్యకు పాల్పడే వ్యక్తికి జీవించే హక్కు లేదు" అపరాధి బాలికపై క్రూరంగా ప్రవర్తించిన తీరు సహించలేనిది." అని అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి గగన్‌దీప్ కౌర్.. ఉరి శిక్షను ఖరారు చేస్తూ వ్యాఖ్యానించారు.
జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మృతురాలి కుటుంబీకులకు రూ.30 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రత్యేక పోక్సో కోర్టు ప్రకటించింది ."దాడి క్రూరత్వం, చనిపోయిన చిన్నారిపై అత్యాచారం, హత్య, దహనం చేసిన అనాగరిక విధానం, తల్లిదండ్రులు అనుభవించిన మానసిక వేదనను...