Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ కలిసి మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు.కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. "జార్...