Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..
Rain Report | వరుస వానలు రాష్ట్రాన్ని వీడడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా ముసురు కమ్ముకుంటుండడంతో ప్రజలు ఇండ్లను విడిచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి వానలకు సంబంధించి అప్రమత్తం చేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.Rain Report In Telangana : భారీ వర్షాలు ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, కరీ...