Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వరుస రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..
Stone Pelting Incident | దేశంలో కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇందుకోసం భారతీయ రైల్వేలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో వందేభారత్ రైలుపై దుండగులు రాళ్లదాడి చేశారు.
అంబ్-అండౌరా స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రైలులోని సుమారు నాలుగు కోచ్‌లు దెబ్బతిన్నాయి. గత శనివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో బసల్ గ్రామ సమీపంలో రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి రెండు కోచ్‌ల కిటికీ అద్దాలను పగులగొట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.రైలుకు జరిగిన నష్టంపై అంచనా వేస్తున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టినట్లు వారు తెలిపారు.
...