Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Rail News

Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం
Trending News

Railway Security : రైల్వే భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం

Railway Security | ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి రైలులోని అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈమేరకు రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయా రైల్వే(Indian Railways) ఆమోదించాయి. చాలా కాలంగా, నడుస్తున్న రైళ్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కేసులు వస్తుండడంతో భారతీయ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు.. ఇంజిన్లు, కోచ్‌లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పురోగతిని సమీక్షించారు. "సీసీ కెమెరాల ఏర్పాటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది. దుండగులు, వ్యవస్థీకృత ముఠాలు అమాయక ప్రయాణికులను దోచుకుంటున్నారు. కెమెరాల ఏర్పాటు వల్ల ఇలాంటి సంఘటనలు తగ్గుతాయి. ...
Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం
Telangana

Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

Kazipet RUR : దక్షిణ భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని కాజీపేట‌లో 340 మీటర్ల పొడవు గల రైలు-అండర్-రైల్ (RUR) నిర్మాణ ప‌నుల‌ను చేపడుతోంది. ఈ సొరంగం రెండు రైళ్లను ఒకేసారి వాటి మార్గంలో సాఫీగా వెళ్లిపోయేలా చేస్తుంది. ఒక రైలు ఉపరితలంపై.. మ‌రో రైలు దాని కింద నుంచి ప్రయాణిస్తుంది. ఇలాంటి త‌ర‌హా నిర్మాణం దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో మొట్ట‌మొదటిది. ఈ రైల్ అండ‌ర్ రైల్ నిర్మాణం.. విజయవాడ-బల్హర్షా సెక్షన్ ద్వారా న్యూదిల్లీ వైపు వెళ్లే రైళ్ల రాక‌పోక‌ల‌ను క్రమబద్ధీకరించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.కాజీపేటలోని రైల్ అండర్ రైల్ (RUR) ఈ ప్రాంతంలో రైల్వేలో విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉంది. రైల్వే ప‌రంగా ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త్ ల‌ను క‌లిపే కీల‌క మార్గంలో కాజీపేట సెక్ష‌న్ ప్ర‌ధాన‌మైన‌ది. న్యూదిల్లీ, చెన్నై, బెంగళూరు. చండీగఢ్, రాయపూర్, జబల్పూర్, లక్నో, గోరఖ్ పూర్, త్రివేండ్రం, ...
Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
National, Trending News

Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం క‌లిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం త‌గ్గిపోయిన కార‌ణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాల‌న్న కార‌ణంతో పలు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ సౌక‌ర్యాన్ని నిలిపివేయాల‌ని నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌, ఏపీలో కొన్ని రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసేశారు కూడా. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు గతంలో ఇచ్చిన హాల్టింగ్ గడువు ముగియడంతో రాకపోకలు ఆగిపోతాయని అంద‌రూ భావించారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 69 రైళ్లకు ఆయా స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈనెల 29వ తేదీతో మొత్తం 69 రైళ్లకు గతంలో జారీ చేసిన గడువు ముగుస్తోంది.ప్రయాణికుల డిమాండ్ తో ప‌లు రైల్వేస్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు అనుమతిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్ల‌డించింది. విజయవాడ మీదుగా రాకపోకలు ...