
ED raids | మంత్రి పొంగులేటికి షాక్.. ఆయన కంపెనీలో ఈడీ దాడులు
ED raids | తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి ఈడీ షాక్ ఇచ్చింది. న్యూఢిల్లీ నుంచి ఈడీ అధికారులు నగరానికి చేరుకుని పొంగులేటి నివాసంలోపాటు కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు న్యూఢిల్లీ నుంచి నగరానికి చేరుకుని రెవెన్యూ మంత్రి, ఇతర వ్యక్తులకు సంబంధించిన 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రికి సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో 16 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆయన కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) , ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ కంపెనీ ఇటీవలే నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ ...