Sunday, August 31Thank you for visiting

Tag: PM modi

Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..

Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..

National, తాజా వార్తలు
Jammu Kashmir Assembly Elections 2024 | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో శుక్ర‌వారం విడుదల చేశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్ర‌గ‌తిని పెంపొందించ‌డానికి పార్టీ అమ‌లు చేయ‌నున్న‌ ప్రణాళికలను ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణం తీసుకురావడానికి బిజెపి చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని అమిత్ షా (Amit shah) అన్నారు. 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా షా జమ్మూ కాశ్మీర్‌పై బీజేపీ దీర్ఘకాల వైఖరిని నొక్కి చెప్పారు. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, బిజెపికి ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను వివ‌రించారు."స్వాతంత్ర్యం నుంచి, జమ్మూ కాశ్మీర్ సమస్య అత్యంత కీల‌క‌మైన అంశంగా త‌మ పార్టీ భావిస్తోంది...
New Vande Bharat Trains | కొత్త‌గా మ‌రో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్‌..

New Vande Bharat Trains | కొత్త‌గా మ‌రో 3 వందే భారత్ రైళ్లు.. రైలు మార్గాలు, టైమింగ్స్‌..

National
New Vande Bharat Trains | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇది కీలక రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. కొత్త రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో ప‌లు రూట్లలో సేవలు అందిస్తాయి, ఇప్పుడు దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతున్న వందే భారత్ నెట్‌వర్క్ విస్తరణలో మరో మైలురాయిని చేరుకుంది. ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు:1. చెన్నై సెంట్రల్ నుంచి నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 2. మధురై నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 3. మీరట్ సిటీ నుంచి లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ Chennai Central to Nagercoil Vande Bharat Express: మొద‌ట చెన్నై సెంట్రల్ నుంచి వందేభార‌త్ రైలు ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. కానీ ఇది చెన్నై ఎగ్మోర్ నుంచి బు...
New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

New Vande bharat Trains | ఈ రూట్ల‌లో ఆగస్టు 31న వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

National
New Vande bharat Trains  | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 31న దిల్లీ నుంచి ఒకే సారి మూడు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు మీరట్ నుంచి లక్నో, చెన్నై నుంచి నాగర్‌కోయిల్ అలాగే బెంగుళూరు నుంచి మధురై రూట్లలో నడుస్తాయి. ఫ్లాగ్ ఆఫ్ చేయబోయే కొత్త రైళ్లు:మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బెంగళూరు-మధురై వందే భారత్ ఎక్స్‌ప్రెస్త్వరలో బికనీర్ నుంచి దిల్లీకి వందే భారత్ నవంబర్‌లో బికనీర్‌ నుంచి ఢిల్లీ మార్గంలో వందే భారత్‌ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ప్రయాణీకులు ఉదయం బికనీర్ నుంచి ఢిల్లీకి ప్రయాణించే వీలు క‌లుగుతుంది. అదే రాత్రి తిరిగి రావొచ్చు. ప్రయాణానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అక్టోబర్ నాటికి షెడ్యూల్, స్టేషన్ స్టాపేజ్‌లు, సమయాలను ఖరారు చేయడంతో నవంబర్ నుంచి రైళ్లు క్రమం తప్పకుండా నడపాలని రైల్వే అధికారులు ...
Industrial Smart Cities | దేశ‌వ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు, 40 లక్షల ఉద్యోగాలకు అవకాశం

Industrial Smart Cities | దేశ‌వ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు, 40 లక్షల ఉద్యోగాలకు అవకాశం

Business
Industrial Smart Cities  | దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 28,602 కోట్ల అంచనా వ్యయంతో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయాల‌ని కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ రూ. 1.52 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రానున్నాయి. దాదాపు 9.39 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి ల‌భించే అవకాశం ఉంది. 12 ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీలు.. Industrial Smart Cities  : అమృత్‌సర్-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై, వైజాగ్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నాగ్‌పూర్, చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లతో సహా ఆరు పారిశ్రామిక కారిడార్లలో ఈ ప్రాజెక్టులను అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. . ఈ ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాలు ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష...
Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Zahirabad Industrial Smart City | Zahirabad | రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్‌.. జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీ.. వివరాలు ఇవే..

Telangana
Zahirabad | తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (Zahirabad Industrial Smart City) ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. బుధవారం దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ భేటీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.28,602 కోట్లతో దేశవ్యాప్తంగా 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్‌ను ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు.ఇందులో భాగంగా రూ.2,361 కోట్లతో ఒక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని తెలంగాణలోని జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది.ఈ ప్రాజెక్టుతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పారిశ్రామిక ప‌రంగా అభివృద్ధి జ‌ర‌గ‌నుంది. హైదరాబాద్-నాగ్‌పూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని న్యాలకల్, జరా సంగ...
Ladakh New Districts | ఐదు జిల్లాలుగా ల‌డ‌ఖ్ ను ఎందుకు విభ‌జిస్తున్నారు.?

Ladakh New Districts | ఐదు జిల్లాలుగా ల‌డ‌ఖ్ ను ఎందుకు విభ‌జిస్తున్నారు.?

National
Ladakh New Districts | కేంద్ర పాలిత ప్రాంత‌మైన ల‌డ‌ఖ్ ను త్వ‌ర‌లో ఐదు జిల్లాలుగా విభ‌జించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై 'X' వేదికపై ఒక పోస్ట్‌లో కేంద్ర హోం మంత్రి మంత్రి అమిత్ షా వెల్ల‌డించారు. ల‌డ‌ఖ్ ను- జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌తంగ్ అనే జిల్లాలుగా విభ‌జిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌కు ప‌రిపాల‌న‌ను చేరువ చేయాల‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.ఈ ఐదు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఇప్పుడు లడఖ్‌లో లేహ్, కార్గిల్‌తో కలిపి మొత్తం ఏడు జిల్లాలు ఏర్పడతాయి. ప్ర‌స్తుతం దేశంలోనే అతిపెద్ద కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ ఉంది. ప్రస్తుతం, లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు ఉన్నాయి. భారతదేశంలోని అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతాలలో ఇదీ ఒకటి. అత్యంత కష్టతరమైన కొండ ప్రాంతాలు, ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఇక్క‌డ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం అట్టడు...
BJP | బిజెపి పార్టీ విస్త‌ర‌ణ కార్య‌క్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు

BJP | బిజెపి పార్టీ విస్త‌ర‌ణ కార్య‌క్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు

National
BJP Offices | భార‌తీయ జ‌న‌తా పార్టీని విస్తరించేందుకు అగ్ర‌నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బిజ‌పీని 768 పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, వాటిలో ఇప్ప‌టికే 563 సిద్ధంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP president JP Nadda ) శనివారం వెల్ల‌డించారు. పనాజీ సమీపంలోని గోవా బీజేపీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయ‌న‌ శంకుస్థాపన చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో ప్రసంగించారు.గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa Chief Minister Pramod Sawant) మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శంకుస్థాపన చేశారు. బిజెపి దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది. 563 పార్టీ కార్యాల‌యాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. గోవాలోని బిజేపి ప్రధాన కార్యాలయం పనాజీ శివార్లలో రాజధాని నగరాన్ని ఓల్డ్ గోవాకు కలిపే హైవేకి సమీపంలో ఉంటుంది. డిసెంబర్ 2026 నాటికి కొత...
Unified Pension Scheme | మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

Unified Pension Scheme | మోడీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. కొత్త ఏకీకృత పెన్షన్ పథకం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రం

National
New Unified Pension Scheme | పెన్షన్ ప‌థ‌కం విషయంలో మోదీ (PM Modi) ప్రభుత్వం సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పాత పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షన్ స్కీమ్ స్థానంలో ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ ల‌భిస్తుందని ప్రభుత్వం వెల్ల‌డించింది. ఈ యూపీఎస్ పథకం (New Unified Pension Scheme) ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం 2025 ఏప్రిల్ 1నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.కొత్త పెన్ష‌న్ స్కీమ్ పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav ) మాట్లాడుతూ.. పదేళ్లు సర్వీసు చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ చెల్లిస్తార‌ని వివ‌రించారు. అలా...
Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

Triple Talaq | మోదీ, యోగిని ప్రశంసించిందుకు ముస్లిం మహిళకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన భర్త

Trending News
Triple Talaq |ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ (Yogi Adithynath) ను  పొగిడినందుకు ఓ ముస్లిం మహిళకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చేప్పేశాడు. మోదీని ప్రశంసించడాన్ని జీర్ణించుకోలేక ఆమె భ‌ర్త ఒక్కసారిగా ఆగ్ర‌హించాడు. ఆపై వెంట‌నే ఆమెకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పి (triple talaq) విడాకులు ఇచ్చేశాడు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది.ఈ ఘనటకు సంబంధించి వివరాల్లోకి వెళితే..  మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా దిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహమైంది.  పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తగారి ఇంటికి చేరుకున్న స‌ద‌రు మహిళ అక్క‌డి రోడ్లు, న‌గ‌ర అభివృద్ధి, చూసి ఆశ్చ‌ర్య‌పోయింది. సంతోషంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీన...
YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

YS Jagan | వక్ఫ్‌ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

Andhrapradesh
YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన వక్ఫ్‌ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. .. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 'ముస్లిం మైనారిటీల సమస్యల ప‌రిష్కారంపై వైసీపీ నిరంత‌రం దృష్టిసారించింద‌ని తెలిపారు. మైనార్టీల‌ సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేశామ‌ని, ముస్లిం మైనారిటీలకు మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని చెప్పారు. ఇక‌ వక్ఫ్‌ బిల్లుపై ముస్లింలు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను త‌మ‌ పార్టీ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడుతార‌ని చెప్పారు. పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి కూడా చొరవ తీసుకుని, అన్ని అభ్యంతరాలను పార్లమెంటు ద...