Saturday, August 30Thank you for visiting

Tag: PM modi

Amrit Bharat Express: సామాన్యుల కోసం ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకత ఏమిటి?

Amrit Bharat Express: సామాన్యుల కోసం ప్రవేశపెడుతున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకత ఏమిటి?

National
Amrit Bharat Express: నాన్-ఏసీ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల కోసం భారతీయ రైల్వే కొత్త రైలును ఆవిష్కరించింది. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, గతంలో డిజైన్ దశలో వందే సాధారన్ అని పిలిచారు. ఇది పుష్-పుల్ రైలు, ఇది లుక్స్, ఫీచర్ల పరంగా సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నుండి ప్రేరణ పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న సెకండ్ క్లాస్ స్లీపర్, సాధారణ అన్‌రిజర్వ్డ్ ప్రయాణికుల కోసం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని భావిస్తున్నారు. ఈ రైలుకు సంబందించిన కొన్ని అద్భుతమైన చిత్రాలతోపాటు ఫాక్ట్స్ ఒకసారి పరిశీలించండి.అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు లోపలి భాగం అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లో 22 కోచ్‌లు 12 సెకండ్ క్లాస్ స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ క్లాస్ కోచ్‌లు అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్‌లు,  రెండు గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. కొత్త రైలులో వికలాంగుల...
PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi : అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

National
PM Modi..Biggest Meditarion center in Varanasi : ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం అందుబాటులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్వవేద్ మహామందిర్ లో ధ్యానమందిరాన్ని ప్రారంభించారు. 7 అంతస్తుల్లో నిర్మించిన ఈ మందిరంలో 20,000 మంది ఒకేసారి ధ్యానం చేసుకునేందుకు వీలుంటుంది. ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM modi ) మాట్లాడుతూ.. ఈ ధ్యాన మందిరాన్ని సందర్శించినప్పుడు తాను ఎంతో మంత్రముగ్ధుడినయ్యానని.. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి దైవిక బోధనలు మహామందిర్ గోడలపై చిత్రాలుగా ఏర్పాటు చేయటం చూసి చాలా ఆనందంగా ఉందని అన్నారు. సాధువుల మార్గదర్శకంలో కాశీ ప్రజలు అభివృద్ధి.. నవ నిర్మాణ పరంగా కొత్త రికార్డులు సృష్టించారని అన్నారు. సర్వవేద్ మహామందిర్ దీనికి ఉదాహరణ అని కొనియాడారు. కాశీలో గడిపిన ప్రతీ క్షణం అద్భుతంగా ఉంటుందని ప్రధాని మోదీ ...
Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..

Assembly Elections 2023: ఈ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి..

National
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 7 నుండి 30 వరకు ఈ ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party (BJP), ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా పరిగణించవచ్చు.ABP News- CVoter విడుదల చేసిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాలలో 3 రాష్ట్రాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేయగా, రాజస్థాన్‌లో బీజేపీ కమలం అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. సర్వే(survey ) వివరాలను ఒకసారి చూడండి.. తెలంగాణ: ఒపీనియన్ పోల్ (opinion polls) ఆధారంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 119 సీట్ల అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు 43 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేయగా, కాంగ్రెస్‌(congress)క...
తెలంగాణపై వరాల వర్షం కురిపించిన ప్రధాని మోదీ..పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!

తెలంగాణపై వరాల వర్షం కురిపించిన ప్రధాని మోదీ..పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటు!

Telangana
తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM MODI) పర్యటిస్తున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ ‘ప్రజాగర్జన’ సభలో ప్రధాని మోదీ వరాల వర్షం కురిపించారు.మహబూబ్‌నగర్: తెలంగాణలో ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM MODI) పర్యటిస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రజాగర్జన సభలో ప్రధాని మోదీ హామీల వర్షం కురిపించారు. బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘‘పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేశాం.. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దేవీ నవరాత్రి ఉత్సవాలకు ముందే శక్తి పూజలు ప్రారంభించాము. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు త్వరలోనే మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్‌ పార్కులు, 4 ఫిషింగ్‌ క్టస్టర్లు నిర్మిస్తాం. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు నిర్ణయం, రూ.900 కోట్లతో సమక్క, సారక్క గిరిజన యూనివర్స...
తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Telangana
అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించి రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌లో అక్టోబర్‌ 1, 3 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.21,566 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (G.Kirshan Reddy) శుక్రవారం తెలిపారు. తన మహబూబ్‌నగర్ పర్యటనలో మోదీ రూ.13,545 కోట్లతో ప్రాజెక్టులను ప్రారంభిస్తారని, నిజామాబాద్‌లో రూ.8,021 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తానని విలేకరుల సమావేశంలో తెలిపారు.ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ (PM Modi) రెండు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ...
Rozgar Mela 2023 : ఈరోజు కొత్తగా చేరిన 51,000 మంది ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ

Rozgar Mela 2023 : ఈరోజు కొత్తగా చేరిన 51,000 మంది ఉద్యోగులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ

National
Rozgar Mela 2023 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా చేరిన రిక్రూట్‌మెంట్లకు సుమారు 51,000 అపాయింట్‌మెంట్ లెటర్‌(Appointment Letters)లను పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 46 ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళా జరగనుంది. రిక్రూట్‌మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలలో జరుగుతోంది. కొత్త రిక్రూట్‌లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ మినిస్ట్రీ, మినిస్ట్రీ, ఆరోగ్యం- కుటుంబ సంక్షేమం వంటి వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో కొత్త ఉద్యోగులు చేరనున్నారు.“రోజ్‌గార్ మేళా(Rozgar Mela 2023) అనేది.. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రధాన మంత్రి ఆలోచనకు అనుగుణంగా వేసిన ఒక అడుగు. రోజ్‌గార్...
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

National
భారతదేశ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.  చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా  215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఏ ఒక్కరూ కూడా ఓటు వేయలేదు. అయితే రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో సగానికిపైగా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి సంతకం చేయగానే బిల్లు పూర్తి చట్టంగా మారుతుంది. కాగా ఈ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్లు అమలు కావడానికి సంవత్సరాలు పడుతుంది. తర్వాతి జనాభా గణంకాల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన పూర్యయ్యాకే మహిళా రిజర్వేషన్ (Women's Reservation Bill) అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సుమారు 10 గంటల పాటు సుదీర్...
చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ

చీరపై 20 దేశాధినేతల చిత్రాలు, G20 లోగో.. సిరిసిల్ల కళాకారుడి అద్భుత ప్రతిభ

Telangana
ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సును పురస్కరించుకొని రాజన్న సిరిసిల్లకు జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు తన ప్రతిభతో అద్భుతమైన కళారూపాన్ని తయారు చేశాడు. ఈ చేనేత కార్మికుడు జి20 సదస్సులో దేశాధినేతల చిత్రాలు, భారతీయ చిహ్నాన్ని రెండు మీటర్ల పొడవు గల వస్త్రంపై చూడచక్కగా నేశాడుతెలంగాణలోని రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు (sircilla handloom worker) వెల్ది హరి ప్రసాద్ దేశ విదేశాలకు చెందిన G20 నాయకులను రెండు మీటర్ల క్లాత్ పై నేయడం ద్వారా తన అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2 మీటర్ల పొడవు ఉన్న ఈ ఫాబ్రిక్ పై భారతీయ చిహ్నం, జీ20 లోగోను కూడా చూపుతుంది. హరి ప్రసాద్ రెండు మీటర్ల పొడవు వస్త్రం పూర్తి చేయడానికి అతనికి వారం రోజులు పట్టింది. ఈ కళాఖండంలో PM మోడీ, హిందీ ఫాంట్‌లో అల్లిన 'నమస్తే' అని రాసి ఉన్నాయి. ప్రసాద్ తన కళాఖండాన్ని ప్రధానితో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.ఇదిలా ఉం...
5% వడ్డీతో  రూ.లక్ష రుణం: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం అంటే ఏమిటి?

5% వడ్డీతో రూ.లక్ష రుణం: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం అంటే ఏమిటి?

National
 PM Vishwakarma Yojana : హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేద చేతి వృత్తులారికి తక్కువ వడ్డీతో రుణాలు అందించడమే కాకుండా వారిలో వృత్తి నైపుణ్యలను పెంచి, మార్కెటింగ్ లోనూ మద్దతునిచ్చేందుకు కేంద్రం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఐదేళ్ల కాలానికి రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రధానమంత్రి ‘విశ్వకర్మ యోజన’ పేరుతో కొత్త పథకానికి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆగస్టు 15న తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే..కాగా ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల పై కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేలు, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాక...
కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi

కార్మికులకు చేయూతనందించేందుకు మరో కొత్త పథకం: PM Modi

National
PM Modi : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ కార్మికుల కోసం సరికొత్త పథకాన్ని ప్రకటించారు. వచ్చే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ రోజున దేశంలో ‘విశ్వకర్మ యోజన’ (Vishwakarma Yojana) అనే కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద దేశంలో స్వర్ణకారులు, ఫర్నిచర్ లేదా కలప వస్తువులను తయారు చేసేవారు అంటే వడ్రంగులు, సెలూన్లు నడిపే నాయీ బ్రాహ్మణులు, బూట్లు తయారు చేసేవారు, ఇళ్ళు నిర్మించే మేస్త్రీలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. కార్మికులు ఎవరైనా సరే స్వర్ణకారులు, మేస్త్రీలు, చాకలివారు.. హెయిర్ కట్ కుటుంబాల వారైనా.. అలాంటి వారిని బలోపేతం చేసేందుకు.. ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు.‘స్వానిధి యోజన’ కింద దేశంలోని కోట్లాది మంది వీధి వ్యాపారులకు తమ ప్రభుత్వం రూ.50,000 కోట్ల వరకు ఆర్థికసాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోడీ (PM M...