Friday, September 12Thank you for visiting

Tag: Pawan kalyan

Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..

Pawan Kalyan | హైదరాబాద్‌లో పుట్టి ఆంధ్రాలో పెరిగి.. కింగ్ మేకర్ గా జనసేన పార్టీ ప్రస్థానం..

Andhrapradesh, Special Stories
Pawan Kalyan Jana Sena Party Formation Day | జనసేన పార్టీ పుట్టి పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సభ (Jana Sena Party Formation Day)ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించి, అసెంబ్లీకి పంపించిన పిఠాపురం నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 2014 మార్చి 14న జనసేన ఆవిర్భవించింది. పదేళ్ల తర్వాత 2024 జూన్ 4న తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. టిడిపి, బిజెపి కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించిన 21 ఎమ్మెల్యే స్థానాలతోపాటు రెండు ఎంపీ స్థానాలను గెల్చుకుని '100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్' సాధించిన రికార్డు నమోదు చేసింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన అన్నయ్య మెగాస్టర్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేశారు. అప్పటికే హీరోగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్‌ తొలిసార...
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామ‌ని బెదిరింపు కాల్..

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామ‌ని బెదిరింపు కాల్..

Andhrapradesh
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జ‌న సేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ళ్యానణ్ కు సోమవారం సాయంత్రం ఆయన కార్యాలయానికి హత్య బెదిరింపు కాల్ (Death threat) వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అజ్ఞాత వ్యక్తి ఉపముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలంతో సందేశాలు కూడా పంపాడు. ఘటన జరిగిన వెంటనే కార్యాల‌య‌ సిబ్బంది వెంట‌నే పోలీసు అధికారులకు సమాచారం అందించారు.(more…)...
ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..

ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..

Andhrapradesh, Trending News
Bangladesh Violence | బంగ్లాదేశ్ లో హిందువులపై హింస, ఇస్కాన్‌ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) అరెస్టు చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. చిన్మోయ్ అరెస్టును ఖండించారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్‌ను కోరారు.ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించడాన్ని మనం అందరం కలిసి ఖండిద్దాం. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని (ప్రభుత్వం) హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అని కళ్యాణ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత సైన్యం చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు.బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భా...
AP Budget 2024 | ఏపీ బడ్జెట్..  శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

Andhrapradesh
Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇదీ..వార్షిక బడ్జెట్ : రూ. 2.94. లక్షల కోట్లు వ్యవసాయ బడ్జెట్ : రూ. 43,402.33 కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.శాఖల వారీగా పూర్తి కేటాయింపులివే..రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. రూ. 4,3...
Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..

Tirupati Laddu | తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో కేంద్రం సీరియస్‌..

Andhrapradesh
Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై కేంద్రం సీరియ‌స్ అయింది. ఆల‌యానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. స‌ద‌రు కంపెనీ స‌ర‌ఫ‌రా చేసిన‌ నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్‌ నోటీసులిచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్‌కు పంపించ‌గా అందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో కేంద్రం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. అయితే, తమిళనాడులో ఏఆర్‌ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్య‌వ‌హారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్‌...
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై  రంగంలోకి దిగిన కేంద్రం..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రంగంలోకి దిగిన కేంద్రం..

Andhrapradesh
Tirupati Laddu Row : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కల్తీ చేశారన్న వివాదం శుక్రవారం (సెప్టెంబర్ 20) మరింత ముదిరి పాకాన ప‌డింది. ఈ వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర‌ నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఇండియా టుడే కథనం ప్రకారం.. తాము నిర్వహించిన ఐదు పరీక్షల్లో పంది కొవ్వు, బీఫ్ ఫ్యాట్, పామాయిల్ తదితరాలను ఉప‌యోగించిన‌ట్లు తేలిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు లడ్డూల నాణ్యత నాసిర‌కంగా మారింన్నారు.ఇదిలా ఉండ‌గా, చంద్రబాబు నాయుడు టీడీపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉండగా లడ్డూల్లో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. టీడీపీ పంచుకున్న ల్యాబ్ రిపోర్టు జూలై నాటిదని, అది నయీం హయాంలోనిదని జ‌గ‌న్‌ పేర్కొన్నారు.కల్తీని అంగీకరించిన టీటీడీకాగా తిరుమల...
జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Andhrapradesh
Sanatana Dharma Rakshana Board | తిరుమ‌ల‌ లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల‌ కొవ్వును వినియోగించార‌నే వార్త‌లపై దేశ‌వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం త‌క్ష‌ణ‌మే సనాతన ధర్మ రక్షణ బోర్డు  ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “తిరుపల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపారని గుర్తించ‌డంతో మేమంతా చాలా షాక్ కు గుర‌య్యాం. ” దిగ్భ్రాంతికరమైన నేరానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాల‌ని ప‌వ‌న్ అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో బాధ్యులైన‌వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు....
Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Elections 2024: బాస్ ఈజ్ బ్యాక్‌.. మ‌రోసారి కింగ్ మేక‌ర్ గా చంద్ర‌బాబు..

Andhrapradesh
Elections 2024:  ఎనిమిది నెలల కిందట‌ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జైలుకు వెళ్లినప్పుడు 74 ఏళ్ల రాజకీయ వేత్త శ‌కం ముగిసింద‌ని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) పార్టీ ప‌నైపోయింద‌ని భావించారు. ఆ సమయంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ దూసుకుపోయిన‌ట్లు అనిపించింది. చంద్ర‌బాబు, ఆయన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరి త‌దిత‌రులు బాబు నిర్భందాన్ని టీడీపీకి సానుభూతి ఓట్లుగా మార్చడానికి పాద‌యాత్ర‌లు చేప‌ట్టారు. చంద్రబాబు నాయుడుకు 2024లో ఓటమిపాలైతే.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితానికి తెరప‌డిన‌ట్లేన‌నుకున్నారు. అయితే చంద్ర‌బాబు వెనుక‌డుగు వేయ‌లేదు.. మరోసారి BJPతో పొత్తు పెట్టుకుని, ఊహించ‌ని విధంగా అపూర్వ విజ‌యం సొంతం చేసుకున్నారు. సినిమాటిక్ టర్నింగ్ పాయింట్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత రాజమండ...
Janasena TDP First List | టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్

Janasena TDP First List | టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు, పవన్‌కళ్యాణ్

Andhrapradesh
 Janasena TDP First List : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ పోటాపోటీ బ‌హిరంగ‌ సభలు పెట్టి ఒకరినొకరు తీవ్ర‌స్థాయిలో దూషించుకుంటూ.. ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో అక్కడ ఎన్నికల కోలాహలం ఊపందుకుంది.Janasena TDP First List టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై తమ తమ పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన మొద‌టి జాబితాలను వెల్లడించారు. ఈ జాబితాలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించచ‌గా, జనసేన మొత్తం 175 స్థానాలకు గాను 24 అసెంబ్లీ స్థానాల్లో అలాగే మొత్తం 25 పార్ల‌మెంట్ స్థానాల్లో మూడు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయనుంది. తొలి జాబితాలో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.టీడీపీ తొలి జాబితాలోని అభ్యర్...
Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !

Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !

Andhrapradesh
 Pawan Kalyan : విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైటెన్షన్ నెలకొంది. అనుమంచిపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను..  ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అడ్డుకునేం దుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసైనికులు వాటిని తొలగించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఇదిలా ఉంటే.. అనుమంచిపల్లి సమీపంలో మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో తీసుకు వెళ్తున్నారు. అయితే వారిని...