Thursday, April 17Welcome to Vandebhaarath

Tag: ORR

RRR Alignment | రీజిన‌ల్ రింగ్ రోడ్ పై స‌ర్కారు కీల‌క ఆదేశాలు.
Telangana

RRR Alignment | రీజిన‌ల్ రింగ్ రోడ్ పై స‌ర్కారు కీల‌క ఆదేశాలు.

RRR Alignment | తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్ ( Regional Ring Road (RRR)) ద‌క్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించేలా ఉండాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నూత‌నంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీలో నెల‌కొల్ప‌నున్న ప‌రిశ్ర‌మ‌లు, అక్కడ నివసించే కుటుంబాలకు అన్నిరకాల వ‌సతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ హైవే అంశాలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని త‌న‌ నివాసంలో సుదీర్ఘంగా స‌మీక్ష నిర్వ‌హించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శి, పలువురు ఉన్నతాధికారులు సమీక్ష స‌మావేశంలో పాల్గొన్నారు.దాదాపు 189 కిలోమీటర్ల ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం (చౌటుప్పల్ నుంచి – ఇబ్రహింపట్నం – కందుకూరు – ఆమన‌గ...
Elevated Corridor | రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ తో ఆరు జిల్లాలకు ప్రయోజనం..
Telangana

Elevated Corridor | రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ తో ఆరు జిల్లాలకు ప్రయోజనం..

Elevated Corridor | ఉత్తర తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నగరం నుంచి కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వరకు ట్రాపిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Secunderabad Cantonment) ప్రాంతంతో ఇరుకైన రోడ్డులో వాహనదాారులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.2,232 కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ క్యారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. క్యారిడార్ నిర్మాణం రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్ లోని జింఖానా మైదానం సమీపంలో గల ప్యాట్నీ సెంటర్ నుంచి ప్రారంభమై కార్ఖానా, తిరుమలగిరి, బల్లారం, ఆళ్వాల్, హకీంపేట, తూంకుంట. మీదుగా శామీర్ పేట సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద ముగుస్తుంది. హైదరాబాద్ నుంచి రాజీవ్ ర‌హ‌దారిపై 11.12 కిలో మీట‌ర్ల పొడ‌వుతో ఆరు లైన్లతో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తున్నారు....