Wednesday, December 18Thank you for visiting
Shadow

Tag: One Nation One Election Bill

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన  కేంద్రం.. త్వరలో JPCకి..

వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం.. త్వరలో JPCకి..

National
New Delhi | పార్లమెంట్‌లో తొలిసారిగా ఇ-ఓటింగ్ తర్వాత ఏకకాల ఎన్నికల(One Nation One Election Bill) కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో ప్రవేశపెట్టారు. ప్రవేశ తీర్మానం మెజారిటీతో ఆమోదించబడింది. తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 198 ఓట్లు పోలయ్యాయి. బిల్లు ఇప్పుడు జేపీసీకి పంపబడుతుంది.కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ‌న్ నేష‌న్‌, వ‌న్ ఎల‌క్ష‌న్ - రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు ఒక సాధారణ బిల్లుల‌ను పెట్టారు. అయితే జ‌మిలి ఎన్నిక‌ల బిల్లు తీవ్ర చర్చకు దారితీసింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. విపక్షాలు ఈ బిల్లును రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి విరుద్ధమని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మనీష్ తివారీ ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. 7వ షెడ్యూల్‌కు మించిన ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేమని, ఈ బిల్...