బడ్జెట్ ధరలోనే సరికొత్త ఫీచర్లతో Moto G35 5G ఫోన్ లాంచ్
Moto G35 5G భారతదేశంలో ఈ రోజు లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 4GB LPDDR4x RAMతో కూడిన Unisoc T760 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.ఇది దుమ్ము, స్ప్లాష్ ను తట్టుకునేలా IP52 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఇందులో చూడవచ్చు. 6.72-అంగుళాల ఫుల్-HD+ LCD స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. ముఖ్యంగా, Moto G35 5G మోడల్ ను మొదట్లో Moto G55 తో పాటు ఎంపిక చేసిన యూరోపియన్ మార్కెట్‌లలో ఆగస్టులో ప్రవేశపెట్టారు. అయితే భారతదేశంలో Moto G55 లాంచ్ చేస్తారా లేదా అనే విషయాలను కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.భారతదేశంలో Moto G35 5G ధరభారతదేశంలో మోటో G35 5G 4GB + 128GB వేరియంట్ ధర 9,999. ఇది దేశంలో ఫ్లిప్‌కార్ట్, అధికారిక మోటరోలా ఇండియా స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ జామ రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్‌నైట్ బ...