Saturday, August 30Thank you for visiting

Tag: Milkipur

Milkipur bypoll : అయోధ్య మిల్కీపూర్ ఉప ఎన్నికలు..  ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజెపి

Milkipur bypoll : అయోధ్య మిల్కీపూర్ ఉప ఎన్నికలు.. ప్రతీకారం తీర్చుకునే పనిలో బిజెపి

National
Milkipur bypoll : గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చేతిలో ఓడిపోయిన ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన మిల్కీపూర్ నియోజకవర్గం నుంచి చంద్రభాన్ పాశ్వాన్‌ (Chandrabhan Paswan)ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మంగళవారం ప్రకటించింది . అయోధ్య (Ayodhya ) సమీపంలో ఉన్న మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప‌ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడనున్నాయి.మిల్కీపూర్ ఉప ఎన్నిక (Milkipur by-election ) ఇప్పుడు బిజెపి, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంతో కూడిన ఫైజాబాద్ లోక్‌సభ స్థానాన్ని(Faizabad Lok Sabha constituency) సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్( Awadhesh Prasad) గెలుచుకోవ‌డం కాషాయ పార్టీని చాలా ఇరుకున పెట్టింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎంపీ అవధేష్‌ ప్రసాద...