Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మహిళలకు వరాల జల్లు..
Jammu Kashmir Assembly Elections 2024 | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో శుక్రవారం విడుదల చేశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్రగతిని పెంపొందించడానికి పార్టీ అమలు చేయనున్న ప్రణాళికలను ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి బిజెపి చిత్తశుద్ధితో పనిచేస్తోందని అమిత్ షా (Amit shah) అన్నారు. 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా షా జమ్మూ కాశ్మీర్‌పై బీజేపీ దీర్ఘకాల వైఖరిని నొక్కి చెప్పారు. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, బిజెపికి ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను వివరించారు."స్వాతంత్ర్యం నుంచి, జమ్మూ కాశ్మీర్ సమస్య అత్యంత కీలకమైన అంశంగా తమ పార్టీ భావిస్తోంది...