Maharashtra CM | మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపికపై ఏక్ నాథ్ కీలక ప్రకటన
Maharashtra CM : ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరిదనే అంశంపై స్పష్టత వచ్చింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకునేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిర్ణయాన్ని వాయిదా వేయడం ద్వారా షిండే ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది. తాను ప్రధానమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ప్రభుత్వ ఏర్పాటుకు "అడ్డంకి" కాబోనని ఏక్ నాథ్ షిండే ప్రకటించారు.కాగా మహారాష్ట్ర సీఎం ఎంపికలో ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించే బాధ్యతను మోదీ.. అమిత్ షాకు అప్పగించారు. ముగ్గురు మహాయుతి నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో అమిత్ షా సమావేశమయ్యారు. అయితే ఇక్కడ షిండే "సానుకూలంగా" ఉన్నప్పటికీ ఆమర అసంతృప్తితో ఉన్నారని పలు వర్గాలు వెల్లడించాయి. తన బేరసారాల వ్యూహాలు విఫలమయ్యాయని గ్రహించిన షిండే, సిఎం, క్యాబినెట్ మ...