Congress Manifesto | కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ఐదు గ్యారంటీలు, 25 కీలక హామీలు ఇవే..
Lok Sabha Elections Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీ పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 25 హామీలను వెల్లడించింది. 48 పేజీల మేనిఫెస్టోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శుక్రవారం విడుదల చేశారు. సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారెంటీలు చేర్చింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించింది. రిజర్వేషన్‌లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తామని హామీ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా నియంత్రిస్తామని హామీ ఇచ్చింది.లోక్‌సభ ఎన్నికల 2024 న్యూస్ లైవ్: కాంగ్రెస్ శుక్రవారం తన పోల్ మేనిఫెస్టో (Congress Manifesto) ను విడుదల చేసింది, రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను ఆవ...