Local Body Polls | గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశంహైదరాబాద్ : మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Local Body Polls ) నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి సంబంధించిన ఆరు పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ జస్టిస్ టి. మాధవి దేవి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వాదనలు ముగిసిన తర్వాత ఈ వారం ప్రారంభంలో కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈ తీర్పు వెలువడింది.హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే తెలంగాణ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Polls ) నిర్వాహణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని న్యాయస్థానం రాష్ట్ర ఎ...