
వీడియో: లిబియాలో భారీ తుఫాను.. 2000 మందికిపైగా మృతి.. తీరం వెంట తుడుచుకుపెట్టుకుపోయిన నగరాలు
Libya floods : తూర్పు లిబియాలోని డెర్నా నగరంలో భారీ వరదలు తుఫాను కారణంగా సుమారు 2,000 మంది మరణించారు. వేలాది మంది వరదల్లో గల్లంతయ్యారు.
తూర్పు లిబియాను నియంత్రించే లిబియా నేషనల్ ఆర్మీ (ఎల్‌ఎన్‌ఎ) ప్రతినిధి అహ్మద్ మిస్మారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ డెర్నా నగరంపై ఆనకట్టలు కూలిపోవడంతో ఈ విపత్తు సంభవించిదని, భవనాలు, ఇళ్లు పూర్తిగా సముద్రంలోకి కొట్టుకుపోయాయని తెలిపారు. తప్పిపోయిన వారి సంఖ్య 5,000-6,000గా పేర్కొన్నారు.
అంతకుముందు సోమవారం, ఈ ప్రాంతంలోని రెడ్ క్రెసెంట్ సహాయ బృందం అధిపతి డెర్నా మరణాల సంఖ్య 150 ఉందని, 250కి చేరుకుంటుందని అంచనా వేశారు.
ట్రిపోలీలో, విభజించబడిన దేశంలో దేశాధినేతగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తుల అధ్యక్ష మండలి.. అంతర్జాతీయ సమాజాన్ని సహాయం కోరింది.
సమాంతర తూర్పు ఆధారిత పరిపాలన అధిపతి ఒసామా హమద్ స్థానిక టెలివిజన్‌తో మాట్లాడుతూ, 2,000 మందికి పైగా మరణించారు.. వేలాది మం...