Sambhal violence : సంభాల్ హింసాకాండలో 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, 27 మంది అరెస్టు
Sambhal violence : సంభాల్ హింసాకాండలో 27 మందిని అరెస్టు చేశామని, పురాతన మసీదుపై భారత పురావస్తు సర్వే (ASI) సర్వేపై రాళ్లు రువ్వడం.. రాళ్లదాడి ఘటన తర్వాత ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ తెలిపారు. ఆ ప్రాంతంలో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు చర్యలుచేపట్టినట్లు ఆంజనేయ కుమార్ సింగ్ ప్రకటించారు."ఇప్పటి వరకు, 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. 22 మంది పేర్లను నమోదు చేశాం. 27 మందిని అరెస్టు చేశారు. ఇంకా 74 మందిని గుర్తించాం. ఇతర నిందితులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. పరిస్థితిని సాధారణీకరించడమే మా లక్ష్యం. బయటి వ్యక్తుల ప్రభావానికి లోనుకాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు నిరాధారమైన ప్రకటనలు చేయడం మానుకోవాలని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కోరారు.“ప్రజలు కేవలం దర్యాప్తు కోసం మాత్రమే కాకుండా, పరిస్థితిని సాధారణీకర...