Wednesday, July 30Thank you for visiting

Tag: L and t

Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు షాక్‌.. వాహ‌నాల పార్కింగ్ డ‌బ్బులు చెల్లించాల్సిందే..

Metro Rail Parking Fee | మెట్రో రైల్ ప్ర‌యాణికుల‌కు షాక్‌.. వాహ‌నాల పార్కింగ్ డ‌బ్బులు చెల్లించాల్సిందే..

Telangana
Metro Rail Parking Fee | హైద‌రాబాద్‌ మెట్రో రైలు ప్రారంభ స్టేషన్లు నాగోల్, మియాపూర్‌లో ఉచిత వాహన పార్కింగ్‌కు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ముగింపు ప‌ల‌కబోతున్న‌ది. నాగోల్‌ స్టేషన్‌లో ఇప్ప‌టికే పార్కింగ్‌ ఫీజుల‌ను వ‌సూలు చేయ‌డం ప్రారంభించింది. గ‌త బుధ‌వారం వాహనాన్ని నిలిపేందుకు వెళ్లిన ప్ర‌యాణికుల‌కు రాత్రి స‌మ‌యంలో అక్క‌డ కొత్త‌ బోర్డులు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. పార్కింగ్‌ ఫీజులు చెల్లించాలనే బోర్డులో పేర్కొన‌డంతో స్టేషన్‌లో నిరసన చేప‌ట్టారు. పార్కింగ్‌ వ్యవస్థల పని తీరును పరీక్షించేందుకు ట్రయల్స్‌ చేపట్టామని, అసౌకర్యానికి చింతిస్తున్నామని ఆ త‌ర్వాత‌ మెట్రో రైలు సంస్థ ఒక‌ ప్రకటనలో పేర్కొంది. బైకు రూ.40, కారుకు రూ.120 నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఆగస్టు 25 నుంచి, మియాపూర్‌ స్టేషన్‌లో సెప్టెంబరు 1 నుంచి పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు సంస్థ స్ప‌ష్టం చేసింది....
Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..

Metro line in Old City: పాత‌బ‌స్తీ వాసుల‌కు గుడ్ న్యూస్‌.. మెట్రో రైలు.. కొత్త స్టేష‌న్లు ఎక్క‌డెక్క‌డంటే..

Telangana
New Metro line in Old City | పాత‌బ‌స్తీ వాసుల చిరకాల స్వ‌ప్నం నెర‌వేరేందుకు అడుగులు పడ్డాయి. ఫలక్‌నుమా వద్ద మెట్రో నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి మార్చి 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 5.5 కిలోమీటర్ల మార్గంలో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నూమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మించ‌నున్నారు. దీనికి సుమారు రూ.2 వేల కోట్ల వరకు వ్య‌య‌మ‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. పాతబస్తీకి మెట్రో రైలు చిర‌కాల స్వ‌ప్నం. ఎన్నో కారణాల వల్ల ఇన్ని సంవత్స‌రాలుగా అక్క‌డ‌ మెట్రో నిర్మాణం సాధ్యం కాలేదు. ఎన్నికలకు ముందే మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప‌లు ప్రణాళికలను రూపొందించింది. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు లైన్‌ నిర్మించాని భావించింది. దీంతో పాతబస్తీలో ప్లాన్లు పెండింగ్ లో పడిపోయాయి. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాతబస్తీ మెట్రో ప్రణాళిక లో క‌ద‌లిక వ‌చ్చింది.మెట్రోలైన్ నిర్మాణంపై రేవంత్ రెడ్డి.. మజ్...