
Greater Bengaluru Authority | ఇక ఐదు జిల్లాలుగా బెంగళూరు మహా నగరం.. కేబినెట్ ఆమోదం
Bengaluru | బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించి గ్రేటర్ బెంగళూరు అథారిటీ (Greater Bengaluru Authority)గా రూపొందించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త సంస్థ 5-10 కార్పొరేషన్లను కలుపుకొని 1400 చ.కి.మీ కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉండనుంది. GBAకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..గార్డెన్ సిటీగా పిలువబడే బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జిబిఎ) ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఏర్పాటుతో సుమారు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర ప్లాన్, ఆర్థికపరమైన నిర్వహణ బాధ్యతలను అధికారాలకు అప్పగించనున్నారు. GBA 950 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1 నుండి 10 కార్పొరేషన్లను...