
Indian Military : కార్గిల్ యుద్ధం తర్వాత భారత సైనిక శక్తి ఎలా మారిపోయింది..?
Indian Military Modernization | 1999 మే- జూలై మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం (Kargil War), భారతదేశ చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయింది. మన సైనికుల ధైర్యసాహసాలు, త్యాగాలు, వ్యూహాత్మక చతురతకు నిదర్శనం కార్గిల్ వార్. హిమాలయాలలోని ప్రమాదకరమైన శిఖరాలలో భారత భూభాగంలోకి పాకిస్తాన్ చొరబడటంతో ప్రారంభమైన ఈ యుద్ధంలో భారత దళాలు కీలక శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుని నియంత్రణ రేఖ (LOC) వెంబడి మరలా పట్టు సాధించాయి. ఈ విజయంలో భారత సైనికుల ధైర్యం నిర్ణయాత్మక పాత్ర పోషించినప్పటికీ, యుద్ధభూమిలో కొన్ని కీలక ఆయుధాలు కూడా నిర్ణయాత్మక పాత్ర పోషించాయి.కార్గిల్‌లో సత్తాచాటిన ఆయుధాలుబోఫోర్స్ FH-77B హోవిట్జర్: స్వీడన్‌లో తయారైన 155mm బోఫోర్స్ ఆర్టిలరీ గన్ కార్గిల్‌లో తిరుగులేని ఆయుధం. నిటారుగా ఉన్న కోణంలో 27 కి.మీ. వరకు కాల్పులు జరపగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది టోలోలింగ్, టైగర్ హిల్, పాయింట్ 4875 వద్ద ప...