Saturday, August 30Thank you for visiting

Tag: Joginpally Santosh Kumar

కూల్చేసిన  వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..

కూల్చేసిన వందేళ్ల నాటి వృక్షానికి మళ్లీ జీవం పోశారు..

Telangana
యాదాద్రి భువనగిరి జిల్లా వాసి కృషి తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది ప్రారంభంలో భూమి ప్లాట్లు కోసం కొంతమంది రియల్టర్ల చేతిలో నరికివేయబడిన 100 ఏళ్ల మర్రి చెట్టుకు మళ్లీ ప్రాణం పోశారు ఈ ప్రకృతి ప్రేమికులు. దాదాపు 10 అడుగుల వ్యాసం కలిగిన 20 టన్నులకు పైగా బరువున్న మర్రి చెట్టును క్రేన్‌ల సాయంతో పైకి లేపి ఓ ప్రైవేట్‌ స్థలంలోకి తరలించారు. భారీ మల్టీ యాక్సిల్‌ ట్రక్కుపై 54 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి జాగ్రత్తగా  చెట్టును మళ్లీ నాటారు. ఇప్పుడది కొ్త్తకొమ్మలు, చిగుటాకులతో పచ్చగా కళకళలాడుతోంది.చెట్టు జీవం పోసిన ప్రకృతి ప్రేమికుడు అనిల్  గోదావర్తి మాట్లాడుతూ.. “మే 30న మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని ఘట్‌కేసర్‌ సమీపంలోని ఘన్‌పూర్‌కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన మర్రిచెట్టు (Banyan Tree) పడి ఉండడం గమనించాను. దాన్నిచూసిన వెంటనే ఆ చెట్టును నా స్థలంలోకి తీసుకురావడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకు...