ISKCON | బంగ్గాదేశ్‌లో ఆగని ఆలయాల ధ్వంసం.. హిందువులే టార్గెట్
Save Hindu in Bangladesh | బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు ఆగడం లేదు. హిందూ ఆలయాల ధ్వంసం ఉదంతాలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల్లో ఇవి మరింత జోరందుకున్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న 27 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశామని హలువఘాట్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి (OC) అబుల్ ఖయేర్ ఈ రోజు వెల్లడించారు.హిందువులే లక్ష్యంగా…గురు, శుక్రవారాల్లో తెల్లవారుజామున రెండు ఆలయాల్లో మూడు విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలను లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా ఇలాంటి వరుస ఘటనలు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. నవంబరు 29న చట్గ్రామ్‌లో మూడు ఆలయాలను దండగులు ధ్వంసం చేశారు. ఈ దాడులను కోట్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ధృవీకరించారు. దుండగులు హింసను ప్రేరేపించడానికే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ...