Thursday, July 31Thank you for visiting

Tag: interest

Post Office New Scheme: ఈ పోస్టల్ స్కీమ్ తో మీరు కొన్నేళ్ల‌లోనే రూ.3 లక్షల ప్రయోజనాన్ని పొంద‌వ‌చ్చు

Post Office New Scheme: ఈ పోస్టల్ స్కీమ్ తో మీరు కొన్నేళ్ల‌లోనే రూ.3 లక్షల ప్రయోజనాన్ని పొంద‌వ‌చ్చు

Business
Post Office New Scheme | మీరు మీ భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయాల‌నుకుంటున్నారా? ప్ర‌స్తుతం మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. అయితే మీ డ‌బ్బుపై న‌మ్మ‌కం విషయానికి వస్తే, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్ అత్యుత్త‌మ‌మైన ఎంపిక. ఎందుకంటే అన్ని పోస్టాఫీసు పథకాలు ప్రభుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే న‌డుస్తాయి. అందువల్ల ఇక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. ఇందులో పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కూడా ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లక్షల విలువైన రాబడులను పొందవచ్చు.పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ నేడు దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పొదుపు పథకం. దీనిలో మీరు ఏకమొత్తం మొత్తాన్ని డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీపై లక్షల రిటర్న్ పొందవచ్చు. ఈ స్కీమ్‌లో మీరు మీ డబ్బును 5 సంవత్సరాల వరకు మాత్రమే డిపాజిట్ చేయాలి. దానిపై మీరు లక్షల ...
EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

Business
EMI Payers | రుణ EMIలను చెల్లించే వారికి  రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని సానుకూల వార్తలను  అందించింది. US ఫెడరల్ రిజర్వ్ మాదిరిగానే, RBI ప్రస్తుత వడ్డీ రేట్లను జూలై వరకు కొనసాగించాలని తాాజగా నిర్ణయించింది. ఆర్బిఐ తాజా నిర్ణయం ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు మారలేదు యూఎస్ ఫెడరల్ రిజర్వ్  వైఖరికి అద్దం పడుతూ జూలై వరకు RBI వడ్డీ రేట్లను వాటి ప్రస్తుత స్థాయిల్లోనే ఉంచుతుందని అనుకుంటున్నారు. నిరంతర ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని ఆర్ధికవేత్తలు సమర్ధిస్తున్నారు. బలమైన GDP వృద్ధి అక్టోబర్-డిసెంబర్ కాలానికి భారతదేశ జిడిపి అంచనాలను మించి 8.1% వృద్ధి రేటును నమోదు చేసింది. ఆర్బిఐ, ఆర్థికవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ఈ బలమైన వృద్ధి ఆర్ధికవ్యవస్ధకు సానుకూల సంకేతం.  అక్టోబర్-డిసెంబర్ మధ్య భారతదేశ జీడీపీ అంచనాలను మించి 8.4...
Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..

Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..

Special Stories
Kisan Credit Card Details: బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు (KCC) కాస్త భిన్నవైనవి. కేవలం రైతుల కోసం మాత్రమే ఉద్దేశించిన రుణ పథకం ఇది. వ్యవసాయ రంగం, రైతులకు అవసరమైన షార్ట్‌ టర్మ్‌ రుణాల కోసం, 1998లో నాబార్డ్‌ (NABARD) ఈ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ లు, కోపరేటివ్‌ బ్యాంక్ లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ లు అందిస్తాయి. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులను ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) లింక్ చేశారు.. కాబట్టి ఆ కార్డులను PM కిసాన్ క్రెడిట్ కార్డ్ లు అని కూడా పిలుస్తారు. కేసీసీల్లో కొంత రుణ పరిమితి (KCC Credit Limit) ఉంటుంది. ఆ మొత్తంతోనే వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేయడం పాటు, ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా, కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్ తో కేవలం పావలా వడ్డీతో...
వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..

వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..

Crime
పాట్నా: బీహార్‌లోని పాట్నా జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లించనందుకు ఓ దళిత మహిళను తీవ్రంగా కొట్టి వివస్త్రను చేసి బలవంతంగా మూత్రం తాగించారు. సభ్య సమాజం చీదరించుకునే ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.9,000 రుణానికి రూ.1,500 వడ్డీ చెల్లించనందుకు దళిత మహిళపై దాడి చేసి, బట్టలు విప్పి, బలవంతంగా మూత్రం తాగించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటనలో మహిళ తలకు గాయమై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందన్నారు. ఆరుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధిత మహిళ తలపై గాయమై చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులకు సమాచారం అందిందని డీఎస్పీ ఫతుహా ఎస్ యాదవ్ తెలిపారు. కేవలం రూ.1500 వడ్డీ చెల్లించకపోవడంతోనే ఇంతటి దారుణానికి పాల్పడారని తెలిపారు. బాధిత మహిళ శనివారం రాత్రి పోలీస్ స్టేషన్‌కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్...