Friday, January 23Thank you for visiting

Tag: Indian Railways

Uttarakhand | మ‌రో రైలు ప్ర‌మాదానికి కుట్ర‌..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్

Uttarakhand | మ‌రో రైలు ప్ర‌మాదానికి కుట్ర‌..? రూర్కీలో రైల్వే ట్రాక్‌లపై LPG సిలిండర్

Crime
cylinder on the railway tracks : ఉత్తర‌ఖండ్ లో మ‌రో రైలు ప్ర‌మాదానికి దుడ‌గులు కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూర్కీ(Roorkee ) లోని ధండేరా స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఖాళీ ఎల్‌పిజి సిలిండర్ కనిపించడంతో ఉత్తరాఖండ్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించే కుట్రను పోలీసులు భగ్నం చేశారు.రైలు డ్రైవర్ సిలిండర్‌ను గమనించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించాడు. ఆదివారం ఉద‌యం 6:35 గంట‌ల‌ సమయంలో, ధంధేరా స్టేషన్ నుంచి దాదాపు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న లండోరా - ధంధేరా మధ్య పట్టాలపై సిలిండర్ కనిపించిందని రూర్కీలోని స్టేషన్ మాస్టర్‌కు గూడ్స్ రైలు లోకో పైలట్ ఫిర్యాదు చేశాడు. పాయింట్‌మెన్‌ని వెంటనే సంఘ‌ట‌న స్థ‌లానికి పంపించి ప‌రిశీలించ‌గా ఆ సిలిండర్ ఖాళీగా ఉందని నిర్ధారించారు. అనంతరం సిలిండర్‌ను దంధేరా వద్ద స్టేషన్‌ మాస్టర్‌ కస్టడీలో ఉంచారు. స్థానిక పోలీసులకు, ప్రభుత్వ రైల్వే పోలీసులక...
Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..

Mumbai to Kazipet Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్ ముంబై నుంచి కాజీపేట‌కు 26 ప్ర‌త్యేక రైళ్లు..

Telangana
Mumbai to Kazipet Trains | దసరా, దీపావళి, ఛత్ పండు గల సమయంలో ప్రయాణికులకు సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా అదనపు ప్రత్యేక రైలు స‌ర్వీస్ ల‌ను ప్రవేశపెడుతున్నట్లు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ పీక్ సీజన్‌లో ప్రయాణికుల ర‌ద్దీని తగ్గించి వారికి సౌక‌ర్య‌వంత‌మైన ప్రయాణాలను అందించేందుకు ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చిన‌ట్లు పేర్కొంది.సెంట్రల్ రైల్వే.. ముంబై నుంచి కాజీపేటకు 26 అదనపు ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తోంది. రాబోయే పండుగలను జరుపుకోవడానికి ప్రయాణించే ప్రయాణీకులకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. రైలు షెడ్యూల్: 07196 / 07195 దాదర్-కాజీపేట వీక్లీ స్పెషల్ (10 సర్వీసులు)దాదర్ నుంచి కాజిపేట‌ : అక్టోబర్ 17, 2024 నుంచి నవంబర్ 28, 2024 వరకు ప్రతీ గురువారం మధ్యాహ్నం 3:25 గంటలకు, మరుసటి రోజు మధ్యాహ్నం 12:50 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. కాజీపేట నుంచి దాద‌ర్‌ : అక్టోబర్...
Navratri Special Meal | ఇక రైళ్లలో రుచికరమైన నవరాత్రి స్పెషల్‌ భోజనం..

Navratri Special Meal | ఇక రైళ్లలో రుచికరమైన నవరాత్రి స్పెషల్‌ భోజనం..

Trending News
Indian Railways Navratri Special Meal | నవరాత్రి పండుగ సీజన్ సంద‌ర్భంగా భార‌తీయ రైల్వే ప్రయాణికుల గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని అందించేందుకు గానూ ‘నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి’ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 150కి పైగా రైల్వే స్టేషన్లలో ఈ ‘నవరాత్రి స్పెషల్‌ థాలి’ భోజనాన్ని ప్రయాణికులు ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.సికింద్రాబాద్‌, ముంబై సహా వివిధ స్టేషన్లలో ప్రత్యేక భోజనాన్ని ప్రయాణికులు పొంద‌వ‌చ్చని, తయారీలో నాణ్యత, పోషకాహారం ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున‌ట్లు రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఐఆర్‌సీటీసీ యాప్‌, ఈ-క్యాటరింగ్‌ వెబ్‌సైట్‌ నుంచి ప్రయాణికులు తమ పీఎన్‌ఆర్‌ నంబర్‌తో ప్రత్యేక భోజనాన్ని ఆర్డర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు.Navratri Special Meal : నవరాత్రి వ్రత స్పెషల్‌ థాలి లభించే కొన్ని ముఖ్య...
Stone Pelting Incident |  భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..

Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..

Trending News
Stone Pelting Incident | దేశంలో కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా అల‌జ‌డులు సృష్టించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఇందుకోసం భార‌తీయ రైల్వేల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వందేభార‌త్ రైలుపై దుండగులు రాళ్ల‌దాడి చేశారు. అంబ్-అండౌరా స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌లో రైలులోని సుమారు నాలుగు కోచ్‌లు దెబ్బతిన్నాయి. గ‌త శనివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో బసల్ గ్రామ సమీపంలో రైలుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వి రెండు కోచ్‌ల కిటికీ అద్దాలను పగులగొట్టారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు.రైలుకు జ‌రిగిన‌ నష్టంపై అంచనా వేస్తున్నట్లు రైల్వే పోలీసు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేప‌ట్టిన‌ట్లు వారు తెలిపారు. ...
వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం

వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం

National
Vande Bharat Metro train : పశ్చిమ మధ్య రైల్వేలోని కోట డివిజన్‌లో కొత్తగా నిర్మించిన 16-కోచ్‌ల వందే భారత్ మెట్రో రేక్ విజయవంతమైన ట్రయల్ రన్‌ను ఇటీవల పూర్తి చేసింది. లక్నోకు చెందిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) బృందం నిర్వహించిన ఈ ట్రయల్, భారతదేశ అధునాతన రైలు నెట్‌వర్క్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచింది.రైల్వే అధికారుల అధికారిక ప్రకటన ప్రకారం , వందే భారత్ మెట్రో రేక్‌ను కోట - మహిద్‌పూర్ రోడ్ స్టేషన్‌ల మధ్య 'అప్' దిశలో అలాగే మహిద్‌పూర్ రోడ్ - షామ్‌ఘర్ స్టేషన్‌ల మధ్య 'డౌన్' లైన్‌లో పరీక్షించారు.కోటా డివిజన్‌కు చెందిన సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రోహిత్ మాల్వియా మాట్లాడుతూ.., వాస్తవ ప్రపంచ పరిస్థితులలో ట్రయల్ నిర్వహించామని, ఒక్కో కోచ్‌లో ప్రయాణీకుల బరువుకు సమానంగా మొత్తం 24.7 టన్నులు లోడ్ చేశామని వివరించారు. "ట్రయల్ సమయంలో రైలు గరిష్టంగా 145 km/h వేగంత...
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

Crime
Stone-Pelting on Trains | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వార‌ణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express )  రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్‌ వాంటెడ్ నిందితుడిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విజయవంతంగా పట్టుకుంది. రైలు ప్రమాదాలకు కార‌కుల‌య్యేవారిని గుర్తించడానికి, నియంత్రించడానికి ATS విస్తృత ద‌ర్యాప్తు చేస్తోంది.ఇదులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ సహాని అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. గతంలో వ్యాస్‌నగర్, కాశీ స్టేషన్ ప్రాంతాల్లో రాళ్లదాడి ఘటనలకు సంబంధించి రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ నంబర్ 324/2024కి సంబంధించి అరెస్టు చేశారు. విచారణలో, హుస్సేన్ అలియాస్ షాహిద్ అని పిలిచే మరొక నిందితుడి పేరును ప‌వ‌న్ కుమార్‌ సహాని బయటపెట్టాడు. ఈ క్లూ ఆధారంగా ATS నిఘా సమాచారాన్ని సేకరించి, చందౌలీలోని మొఘల్ సరాయ్‌లో అద్దెకు ఉంటున్న హుస్సేన్‌ను...
Goa Train | సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం  

Goa Train | సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం  

Telangana
Secunderabad-Goa Train | గోవా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా (గోవా) – సికింద్రాబాద్‌ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కొత్త రైలును అక్టోబ‌ర్‌ 6న ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌ – వాస్కోడగామా (07039) వన్‌ వే స్పెషల్‌ రైలును ఉదయం 11.45 గంటలకు ప్రారంభించనుందిజ ఈ నెల 9 నుంచి రెగ్యులర్‌ సేవలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని సౌత్‌సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా (17039) రైలు ప్రతీ బుధవారం, శుక్రవారాల్లో సేవ‌లందించ‌నుంద‌ని, ఇక తిరుగు ప్ర‌యాణంలో వాస్కోడిగామా – సికింద్రాబాద్‌ (17040) రైలు గురువారం, శనివారాల్లో న‌డుస్తుంద‌ని చెప్పింది....
ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..

ప్రపంచస్థాయి విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబద్ రైల్వే స్టేషన్.. ఇక నుంచి కొత్త రూల్స్..

Trending News
Secunderabad Railway Station : హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రపంచస్థాయి విమానాశ్రయంలా రూపుదిద్దుకుంటోంది. త్వరలో ప్రయాణికులకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఆధునికీకరించిన స్టేషన్, ప్రస్తుతం ప్రపంచ స్థాయి సౌకర్యాలను కల్పించారు. అయితే ఈ స్టేష‌న్‌ వచ్చే ఏడాది చివరి నాటికి సిద్ధం కానుంది.ఎయిర్‌పోర్ట్‌లలో బ్యాగేజీ స్క్రీనింగ్, వెయిట్-ఇన్ లాంజ్ వంటి సౌక‌ర్యాలు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్లాట్ ఫాంపై నిలిచి బ‌య‌లుదేరేముందు మాత్ర‌మే ప్రయాణికులను మాత్రమే ప్లాట్‌ఫారమ్‌పైకి అనుమ‌తించ‌నున్నారు. దీనివ‌ల్ల ప్లాట్ ఫాంపై ప్ర‌యాణికులు కిక్కిరిసిపోయే ప‌రిస్థితి ఉండ‌దు. భోపాల్ స్టేష‌న్ త‌ర్వాత‌.. రూ.700 కోట్ల భారీ వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేసి మోడ్ర‌న్‌ స్టేషన్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌ను పటిష్ట భద్రతా ఫీచర్లతో కూడిన ఎయ...
South Central Railway | సికింద్రాబాద్ – కాజీపేట – విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు..

South Central Railway | సికింద్రాబాద్ – కాజీపేట – విజయవాడ మార్గంలో పలు రైళ్లు రద్దు..

Telangana
South Central Railway | సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ డివిజన్‌లోని విజయవాడ-కాజీపేట-బల్హర్షా  మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు  దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వరంగల్-హసన్‌పర్తి-కాజీపేట 'ఎఫ్' క్యాబిన్-హసన్‌పర్తి రోడ్ స్టేషన్ మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్, ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైలు సర్వీసుల్లో మార్పులను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ( List of cancelled trains ) ను పరిశీలించండి. రద్దయిన రైళ్ల జాబితా ఇదే (List of cancelled trains)..రైలు నం. 12511 గోరఖ్‌పూర్ - కొచ్చువేలి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్సెప్టెంబర్ 29 , అక్టోబర్ 3,  4వతేదీల్లో రద్దు.. రైలు నం. 12512 కొచ్చువేలి - గోరఖ్‌పూర్ రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్29 , అక్టోబర్ 1, 2, 6. రైలు నెం. 12521 బరౌనీ - ఎర్నాకులం రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 . రైల...
Festive Season | టికెట్‌ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే

Festive Season | టికెట్‌ లేని ప్రయాణికులకు ఉచ్చు బిగించిన రైల్వే

Trending News
Festive Season | రైళ్ల‌లో టికెట్ లేకుండా ప్ర‌యాణించేవారికి (Ticketless Travellers) భారతీయ రైల్వేశాఖ ఝ‌ల‌క్ ఇవ్వ‌నుంది. పండుగ సీజన్లలో ప్రత్యేక టిక్కెట్-చెకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది, టిక్కెట్ లేని ప్రయాణికులను తనిఖీ చేయడానికి, పోలీసులతో రైల్వే సిబ్బందిని విస్తృత‌స్థాయిలో మోహ‌రించ‌నుంది. అక్టోబర్ 1 నుండి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు టిక్కెట్ లేని, అనధికారిక ప్రయాణికులపై ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణ‌యించింది. టికెట్ లేకుండా ప్ర‌యాణించేవారిపై 1989 రైల్వే చట్టంలోని నిబంధనల ప్ర‌కారం చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ 17 జోన్ల జనరల్ మేనేజర్‌లకు లేఖ రాసింది.పండుగ రద్దీ నేప‌థ్యంలో వివిధ రైల్వే డివిజన్లలో రెగ్యులర్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్న రైల్వే కమర్షియల్ అధికారులతో పాటు పోలీసులు కూడా త‌నిఖీల్లో ఉంటారని అధికారులు పేర్కొంటున...